టైటిల్‌ వివాదంలో సల్మాన్‌ ‘భారత్‌’ | Salman Khan Bharat in Trouble PIL Filed For Change of Title | Sakshi
Sakshi News home page

టైటిల్‌ వివాదంలో సల్మాన్‌ ‘భారత్‌’

Published Fri, May 31 2019 11:48 AM | Last Updated on Fri, May 31 2019 11:48 AM

Salman Khan Bharat in Trouble PIL Filed For Change of Title - Sakshi

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భారత్‌. అలీ అబ్బాస్ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్‌ ఐదు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. ఈద్‌ సందర్భంగా జూన్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ సినిమాపై వివాదం మొదలైంది. సినిమాకు భారత్‌ అనే టైటిల్‌ను పెట్టడం చట్ట విరుద్ధం అంటూ విపిన్‌ త్యాగీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

భారత్‌ అనే పేరును బిజినెస్‌ కోసం ఉపయోగించటంపై ఢిల్లీ హైకోర్ట్‌లో పిటీషన్ వేశారు. సెక్షన్‌ 3 ప్రకారం అలా వినియోగించటం చట్ట రీత్యా నేరం అంటూ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు సినిమాతో హీరో పాత్రను దేశంతో పోలుస్తూ చెప్పిన డైలాగ్‌లను కూడా మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జూన్‌ 5న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement