Pan India Movie Children Film Lilly First Look Poster Release - Sakshi
Sakshi News home page

Lilly Movie First Look: ఈ సినిమాలోని బాలనటులకు మంచి భవిష్యత్తు: వీవీ వినాయక్

Published Sat, Oct 1 2022 8:08 PM | Last Updated on Sat, Oct 1 2022 8:47 PM

Pan India Movie Childrens Film Lilly First Look Poster Release - Sakshi

నేహ లీడ్‌రోల్‌లో వేదాంత్‌ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా తెరకెక్కిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంలో రాజ్‌వీర్‌ ముఖ్యప్రాతలో నటించారు. ఈ సినిమా ద్వారా శివమ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోపురం స్టూడియోస్‌ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్‌కుమార్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు ఎమోషనల్‌ సాంగ్‌ను దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. 

దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. 'శివమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్యాన్సర్‌పై పోరాటంపై ఉంటుంది. క్రియేటివ్ యూనిక్ గా ఉంది. అలాగే సీనియర్ నటుడు శివ కృష్ణ సినిమా మీద ఎంతో ప్యాషన్‌ ఉన్న వ్యక్తి. ఆయన మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

(చదవండి: న్యాచురల్ స్టార్ 'దసరా' అప్‌డేట్.. ఊరమాస్‌ లుక్‌లో నాని)

నటుడు శివ కృష్ణ మాట్లాడుతూ... 'నా కెరీర్ లో చాలా మంది దర్శకులతో పని చేశా. కానీ వీవీ వినాయక్ అంత కూల్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయనతో పనిచేయడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి రావడం సంతోషం' అని అన్నారు. దర్శకుడు శివమ్‌ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో లిల్లీ పాత్రలో నటించిన నేహ నా జీవితానికి టర్నింగ్ ‌పాయింట్‌. 32 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమానే ఈ  చిత్రానికి ఇన్స్‌పిరేషన్‌' అని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement