Suma Kanakala's son Roshan makes his debut as hero, first look released - Sakshi
Sakshi News home page

Anchor Suma: హీరోగా కొడుకు లుక్‌ షేర్‌ చేస్తూ మురిసిపోయిన యాంకర్‌ సుమ

Published Thu, Mar 16 2023 5:00 PM | Last Updated on Thu, Mar 16 2023 5:21 PM

Anchor Suma Son Roshan Makes Debut As Hero, First Look Release - Sakshi

స్టార్‌ యాంకర్‌ సుమ, నటుడు రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్‌’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత చదువులపై ఫోకస​ పెట్టాడు. పై చదువుల కోసం యూఎస్‌ వెళ్లిన రోషన్‌ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. త్వరలో రోషన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అయితే అది ఏ మూవీ, ఏ ప్రోడక్షన్‌ అనేది సస్పెన్స్‌లో ఉంది. ఈ క్రమంలో మార్చి 15న రోషన్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన ఇచ్చారు మేకర్స్‌.

చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ నటి

అంతేకాదు హీరోగా డెబ్యూ ఇస్తున్న రోషన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఈ సందర్భంగా రిలీజ్‌ చేశారు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్ పేరేపు.. రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రం రూపొందుతోంది. పి విమల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్‌లో రోషన్‌ డిజేగా కనిపించాడు. తనయుడు లుక్‌ను షేర్‌ చేస్తూ సుమ మురిసిపోయింది. ‘ఎట్టకేలకు నీ కల నిజమైంది రోషన్‌’ అంటూ సుమ తన పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. 

చదవండి: ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement