debut film
-
రాధిక కొత్త ప్రయాణం
కథానాయికగా, ఆ తర్వాత క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా చిత్రసీమలో రాధిక ఎన్నో విజయాలు చూశారు. ఇటు బుల్లితెరపైనా నటిగా, నిర్మాతగా ఆమె కెరీర్ హిట్. భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కిళక్కే పోగుమ్ రైల్’ (1978) ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు రాధిక. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న రాధిక ఫ్రెంచ్‌లో తొలి చిత్రం అంగీకరించారు. ‘‘నా సినిమా కెరీర్లో కొత్త ప్రయాణం ఆరంభించాను. ఫ్రెంచ్ సినిమాలో నటించడం నాకో కొత్త అనుభూతి. ఈ కొత్త ప్రయాణానికి ప్రోత్సహించిన శరత్‌కుమార్ (రాధిక భర్త), రేయాన్ (కుమార్తె)లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు రాధిక. ఈ చిత్రానికి లారెన్స్ వాలిన్ దర్శకుడు. -
హీరోగా మారిన యాంకర్ సుమ కొడుకు.. ఫస్ట్‌లుక్ అవుట్.. డైరెక్టర్ ఎవరంటే
స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత చదువులపై ఫోకస పెట్టాడు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. త్వరలో రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అయితే అది ఏ మూవీ, ఏ ప్రోడక్షన్ అనేది సస్పెన్స్‌లో ఉంది. ఈ క్రమంలో మార్చి 15న రోషన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన ఇచ్చారు మేకర్స్. చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ నటి అంతేకాదు హీరోగా డెబ్యూ ఇస్తున్న రోషన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్ పేరేపు.. రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రం రూపొందుతోంది. పి విమల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్లో రోషన్ డిజేగా కనిపించాడు. తనయుడు లుక్‌ను షేర్ చేస్తూ సుమ మురిసిపోయింది. ‘ఎట్టకేలకు నీ కల నిజమైంది రోషన్’ అంటూ సుమ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. Team @maheshwarimovie wishes #RoshanKanakala a very Happy Birthday 💥 #ProductionNo1 pic.twitter.com/KTmKFsMme6 — Ravikanth Perepu (@ravikanthperepu) March 15, 2023 View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) చదవండి: ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని -
బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరహాలోనే పుష్ప మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌తో మూవీ చేయనున్నాడు అనే అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొరటాల శివతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కారటాల మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాతే బన్నీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడట. సో ఈ గ్యాప్‌లో ఓ మూవీ చేయాలని బన్నీ భావిస్తున్నాడట. ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనతో మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే అనూహ్యంగా పుష్ప అనంతరం బన్నీ బాలీవుడులో ఎంట్రీ ఇవ్వాలని డిసైడయ్యాడట. ఇప్పటికే కొందరు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఆయనకు కథలు వినిపిస్తున్నట్లు సమాచారం. బన్నీకి సౌత్‌లోనూ నార్త్‌లోనూ క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆయనతో సినిమా చేసేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారట. మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్లో ఓ మంచి కథతో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అల్లు అర్జున్‌కు ఇది వరకే బాలీవుడ్లో అవకాశాలు వచ్చినా వాటిని పక్కనపెట్టాడు. అయితే ఈసారి మాత్రం బాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీకి ఇదే కరెక్ట్ టైమ్ బన్నీ భావిస్తున్నాడట. ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అనౌన్స్ చేసే తర్వాతి ప్రాజెక్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి : 'తగ్గేదే లే'.. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు 'పుష్ప' ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ? -
హీరోగా జూ.ఎన్టీఆర్ అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. 17ఏళ్ల వయసులో హీరోగా ఎన్టీఆర్ చేసిన తొలి సినిమా అది. అప్పటికే బాల రామాయణం సినిమాతో చెల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యి ప్రశంసలు దక్కించుకున్నాడు ఎన్టీఆర్. ఇక హీరోగా ఎన్టీఆర్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో 2001 విడుదలైన ఈ సినిమా ఇటీవలె 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. హీరోగా చేసిన తొలి సినిమాకు ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా అంటూ ఓ వార్త సోషల్ మీడియాలా హల్చల్ చేస్తుంది. 'నిన్ను చూడాలని' సినిమాకు గాను ఎన్టీఆర్ అక్షరాలా 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట. తొలి పారితోషికం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ ఆ డబ్బును తల్లికి ఇచ్చి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక నిన్ను చూడాలని సినిమా అనంతరం రెండేళ్లలోనే స్టూడెంట్ నెం 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ కొమురం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అనంతరం 'కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అనంతరం ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సానా డైరెక్షన్లో నటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి : RRR Movie: ఫైట్ సీన్‌కి కన్నీళ్లొస్తాయి! 'తగ్గేదే లే'.. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు -
నిఖిల్ సరసన నందిత
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తాజా చిత్రంలో తమిళ నటి నందితా శ్వేత కధానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది. కొన్ని నెలల పాటు కొత్త హీరోయిన్ కోసం అన్వేషించిన చిత్ర యూనిట్ ఫైనల్‌గా నందితా శ్వేతను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నిఖిల్ సరసన ఈ సినిమాలో అవికా గోర్, హెబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా నందిత కూడా అలరించనుంది. తెలుగులో అవకాశాలు తలుపు తట్టినప్పటికీ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకు ఏ సినిమా అంగీకరించలేదని నందిత చెబుతోంది. ప్రస్తుతం ఓ హర్రర్ థ్రిల్లర్‌లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె.. అది పూర్తవగానే నిఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకధగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రెండు వేరు వేరు పాత్రల్లో కనిపించనున్నాడు. ఆనంద్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర స్వరాలందిస్తున్నాడు. -
బుల్లి హీరో టీజర్ కోసం అగ్రహీరో
హైదరబాద్: అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో వారసుడు అఖిల్ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓకే చెప్పారట. కండలవీరుడు సల్మాన్‌తో పాటు మరో ఇద్దరు దిగ్గజ నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. 'అఖిల్' మూవీ టీజర్ ను శనివారం సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, మరో హీరో నితిన్ ట్వీట్ చేశారు. ఇటీవల చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలకు హైదరాబాద్ వచ్చినపుడు హీరో నాగార్జున సల్మాన్ ను ఒప్పించారట. తన కుమారుడి సినిమా టీజర్ రిలీజ్ చేయాలని కోరడంతో ఆయన వెంటనే దీనికి అంగీకరించారట. కాగా హీరో నితిన్ నిర్మాణ సారథ్యంలో వీవీ వినాయక్ దర్శకత్వంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సయేషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్, థమన్ సంగీతం అందిస్తున్నారు. Action packed teaser of #AKHIL at 6.30 pm today..butterflies in my stomach!! — nithiin (@actor_nithiin) August 29, 2015 -
'పిల్లా..నువ్వు లేని జీవితం' టీంతో చిట్‌చాట్
-
ఎంట్రీతోనే.. అదరగొట్టాడు..!
-
తెలుగులో పవన్ కల్యాణ్ కొడుకు సినిమా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. అకీరా తన తల్లి రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ సినిమా 'ఇష్క్ వాలా లవ్'లో అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పవన్ అభిమానుల కోసం ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. రేణు దేశాయ్ ఫేస్బుక్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. 'ఇష్క్ వాలా లవ్ చిత్రం తెలుగు డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలుగు చిత్రం ట్రైలర్‌ను త్వరలో విడుదల చేస్తాం' అని రేణు దేశాయ్ తెలిపారు. రేణు పవన్‌తో విడిపోయినా అతణ్ని ప్రశంసిస్తూ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంటారు. అకీరా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలను రేణు గతంలో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.