
బుల్లి హీరో టీజర్ కోసం అగ్రహీరో
హైదరబాద్: అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో వారసుడు అఖిల్ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓకే చెప్పారట. కండలవీరుడు సల్మాన్తో పాటు మరో ఇద్దరు దిగ్గజ నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. 'అఖిల్' మూవీ టీజర్ ను శనివారం సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, మరో హీరో నితిన్ ట్వీట్ చేశారు. ఇటీవల చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలకు హైదరాబాద్ వచ్చినపుడు హీరో నాగార్జున సల్మాన్ ను ఒప్పించారట. తన కుమారుడి సినిమా టీజర్ రిలీజ్ చేయాలని కోరడంతో ఆయన వెంటనే దీనికి అంగీకరించారట.
కాగా హీరో నితిన్ నిర్మాణ సారథ్యంలో వీవీ వినాయక్ దర్శకత్వంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సయేషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్, థమన్ సంగీతం అందిస్తున్నారు.
Action packed teaser of #AKHIL at 6.30 pm today..butterflies in my stomach!!
— nithiin (@actor_nithiin) August 29, 2015