
పాన్ ఇండియా ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (సీసీఎల్) సందడి మళ్లీ మొదలు కాబోతుంది. ఈ నెల 18 నుంచి సీసీఎల్ ప్రారంభం కానుంది. ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన బిగ్గెస్ట్ స్టార్స్ జట్లు పోటీపడనున్నాయి. రాయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్‌పూర్, త్రివేండ్రం, జైపూర్ నగరాలు 19 గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
సీసీఎల్ జట్లు ఇవే.. సల్మా న్ ఖా న్ బ్రాండ్ అంబాసిడర్‌గా రితేష్ దేశ్‌ముఖ్ కెప్టె న్ గా ముంబై హీరోస్, ఆర్య కెప్టెన్‌గా చెన్నై రైనోస్, వెంకటేష్ కో ఓనర్– అఖిల్ కెప్టెన్‌గా తెలుగు వారియర్స్, మనోజ్ తివారీ కెప్టె న్ గా భోజ్‌పురి దబాంగ్స్, మోహన్ లాల్ కో ఓనర్‌గా కుంచాకో బోప న్ కెప్టె న్ గా కేరళ స్ట్రైకర్స్, బోనీ కపూర్ కో ఓనర్‌గా జిసుసేన్ గుప్త కెప్టన్‌గా బెంగాల్ టైగర్స్, సుదీప్ కెప్టె న్ గా కర్ణాటక బుల్డోజర్స్, సోనూసూద్ కెప్టెన్‌గా పంజాబ్ దే షేర్.