celebrity cricket league
-
ఒక్కడికి సీరియస్‌నెస్ లేదు; థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ఒక వింత సన్నివేశం చోటుచేసుకుంది. ఆడుతుంది ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా కాస్త అయినా సీరియస్‌నెస్ లేదు. పిచ్చి చేష్టలతో థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కించారు ఇరుజట్ల ఆటగాళ్లు. విషయంలోకి వెళితే.. తెలుగు వారియర్స్, కర్నాటక బుల్డోజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తెలుగు వారియర్స్‌కు అఖిల్ నేతృత్వం వహించగా.. కర్నాటకకు సుదీప్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కర్నాటక ఇన్నింగ్స్ సమయంలో విచిత్ర సంఘటన జరిగింది. బౌలర్ వేసిన బంతిని కర్నాటక బ్యాటర్ కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్ బాగానే పూర్తి చేసిన బ్యాటర్లు రెండో పరుగు కోసం యత్నించారు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి వెళ్లిన బ్యాటర్.. కీపర్ బంతిని స్టంప్స్‌కు వేసే సమయానికి అతనికి అడ్డుగా వెళ్లాడు. దీంతో రనౌట్ చాన్స్ మిస్ అయింది. బంతి కూడా దూరంగా వెళ్లడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ మూడో పరుగు కోసం స్ట్రైకింగ్ ఎండ్‌కు వచ్చేశాడు. అప్పటికి మరొక బ్యాటర్ అక్కడే ఉన్నాడు. తెలుగు వారియర్స్ ఫీల్డర్ చెత్త త్రో వేయడం.. ఇంతలో ఎవరు ఊహించని హైడ్రామా జరిగింది. మైదానంలోకి మూడో బ్యాటర్ ఎంటరయ్యాడు. అసలు అతను ఎందుకు వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు. ఇదంతా ఒక ఎత్తు అంటే.. చివరికి ఇద్దరు బ్యాటర్లు మళ్లీ ఒకే ఎండ్‌లోకి చేరుకోవడం.. అటు ఫీల్డర్ కూడా సరైన త్రో వేయడంతో ఈసారి కీపర్ వికెట్లను గిరాటేశాడు. కానీ స్ట్రైకింగ్ ఎండ్‌లో బ్యాటర్లు ఎవరు లేరన్న విషయాన్ని గుర్తించిలేకపోయారు. ఆ తర్వాత తెలుగు వారియర్స్ ఆటగాళ్లు ఔట్ అంటూ అప్పీల్ చేశారు. మైదానంలో ఉన్న ఫీల్డ్ అంపైర్లకు ఏం అర్థంగాక థర్డ్ అంపైర్‌ను సంప్రదించారు. అప్పటికే ఆటగాళ్ల పిచ్చి చేష్టల కారణంగా థర్డ్ అంపైర్‌కు మెంటల్ ఎక్కే ఉంటుంది. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక కాసేపు అలాగే ఉండిపోయాడు. చివరకు ఏం రివ్యూ ఇవ్వాలో తెలియక బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించి.. అటు పరుగులు ఇవ్వలేదు.. ఇటు బంతిని కౌంట్ చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు.ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయలక్ష్యాన్ని సాధించింది. చదవండి: తెలివైన క్రికెటర్.. 'క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా' -
సీసీఎల్ విజేత తెలుగు వారియర్స్
విశాఖ స్పోర్ట్స్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో శనివారం రాత్రి భోజ్‌పురి దబాంగ్ జట్టుతో జరిగిన ఫైనల్లో పోటీలో తెలుగు వారియర్స్ జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దబాంగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను పది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషోర్ రెండు వికెట్లు తీశాడు. ప్రతిగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ అఖిల్ 67 పరుగులతో రాణించాడు. తరువాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దబాంగ్ ఆరు వికెట్లకు 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి విజయలక్ష్యాన్ని సాధించింది. అశ్విన్ 31 పరుగులు చేశాడు. స్పాన్సర్ల ద్వారా పాస్‌లతో అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. ఫైనల్స్‌లో తెలుగు వారియర్స్ ఆడుతుండడంతో తమ అభిమాన తారల ఆటను వీక్షించేందుకు తరలివచ్చారు. జట్టు మెంటర్ వెంకటేష్ అభిమానులను ఉత్సాహాపరిచాడు. రాష్ట్ర మంత్రి అమర్నాథ్ బాక్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు. వారియర్స్ జట్టుతో కలిసి తొలి ఇన్నింగ్స్ ముగియగానే అభివాదం చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. -
సీసీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ (ఫొటోలు)
-
CCL: విశాఖలో సందడిగా సినీ తారల క్రికెట్ మ్యాచ్ (ఫొటోలు)
-
CCL 2023: సీసీఎల్ మళ్లీ వచ్చేస్తుంది.. హీరోలు బ్యాట్ పట్టి సిక్స్ కొడితే..
తమిళసినిమా: క్రికెట్ పోటీలు అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇక సినీ కళాకారుల క్రికెట్ అంటే ప్రత్యేకంగా చెప్పాలా? సందడే సందడి. హీరోలు స్డేడియంలో బ్యాట్ పట్టి సిక్స్ కొడితే.. ఫ్యాన్స్‌కు పునకాలే వస్తాయి. ఇటీవల కరోనా కారణంగా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) జరగలేదు. ఈ నెల 18వ తేదీ నుంచి సీసీఎల్ పోటీల సందడి మొదలవుతోంది. ఇందులో 8 రాష్ట్రాలకు చెందిన సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, కేరళా స్ట్రైకర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. కాగా ముంబాయి హీరోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్, కెప్టెన్‌గా రితేశ్ దేశ్‌ముఖ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెన్నై రైనోస్ జట్టుకు కెప్టెన్ జీవా ఐకాన్ ప్లేయర్‌గానూ, విష్టు విశాల్ స్టార్ క్రీడాకారుడిగా ఉన్నారు. తెలుగు వారియర్స్ జట్టుకు నటుడు వెంకటేశ్ సహ నిర్వాహకుడిగానూ, అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. బోజ్‌పురి దబాంగ్ జట్టుకు మనోజ్ తివారి కెప్టెన్‌గా, కేరళా స్ట్రైకర్స్ జట్టుకు నటుడు మోహన్‌లాల్ సహ నిర్వాహకుడిగా కుంజాకోబోపన్ కెప్టెన్‌గా ఉన్నారు. బెంగాల్ టైగర్స్ జట్టుకు బోనీకపూర్ సహ నిర్వాహకుడిగా, జిసుసేన్ గప్లా కెప్టెన్‌గా ఉండనున్నారు. కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు సుదీప్, పంజాబ్ ది ఫేర్ జట్టుకు సోనూసూద్ కెపె్టన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 18వ తేదీ నుంచి రాయ్‌పూర్, జైపూర్, బెంగళూర్, త్రివేండ్రం, జోద్పూర్, హైదరాబాద్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. అదే విధంగా మార్చి 19వ తేదీ ఫైనల్ పోరు జరుగుతుంది. ఈ పోటీలు జీటీవీలో లైవ్ ప్రసారం అవుతాయని నిర్వాహకులు బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పోటీల కోసం గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెన్నై రైనోస్ జట్టు కెప్టెన్ జీవా తెలిపారు. -
పాన్ ఇండియా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (ఫొటోలు)
-
18 నుంచి సీసీఎల్ సందడి
పాన్ ఇండియా ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (సీసీఎల్) సందడి మళ్లీ మొదలు కాబోతుంది. ఈ నెల 18 నుంచి సీసీఎల్ ప్రారంభం కానుంది. ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన బిగ్గెస్ట్ స్టార్స్ జట్లు పోటీపడనున్నాయి. రాయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్‌పూర్, త్రివేండ్రం, జైపూర్ నగరాలు 19 గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సీసీఎల్ జట్లు ఇవే.. సల్మా న్ ఖా న్ బ్రాండ్ అంబాసిడర్‌గా రితేష్ దేశ్‌ముఖ్ కెప్టె న్ గా ముంబై హీరోస్, ఆర్య కెప్టెన్‌గా చెన్నై రైనోస్, వెంకటేష్ కో ఓనర్– అఖిల్ కెప్టెన్‌గా తెలుగు వారియర్స్, మనోజ్ తివారీ కెప్టె న్ గా భోజ్‌పురి దబాంగ్స్, మోహన్ లాల్ కో ఓనర్‌గా కుంచాకో బోప న్ కెప్టె న్ గా కేరళ స్ట్రైకర్స్, బోనీ కపూర్ కో ఓనర్‌గా జిసుసేన్ గుప్త కెప్టన్‌గా బెంగాల్ టైగర్స్, సుదీప్ కెప్టె న్ గా కర్ణాటక బుల్డోజర్స్, సోనూసూద్ కెప్టెన్‌గా పంజాబ్ దే షేర్. -
త్వరలోనే క్రికెట్ పండగ.. ఎనిమిది జట్లతో మెగా టోర్నీ
సెలబ్రీటీల క్రికెట్ సందడి త్వరలోనే మొదలు కానుంది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు సీసీఎల్ ట్వీట్ చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను క్రికెట్ ఫీల్డ్‌లోకి తీసుకువచ్చే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ మెగా లీగ్ ఫిబ్రవరి 18, 2023 నుండి ప్రారంభమవుతుందని సీసీఎల్ వెల్లడించింది. తెలుగు వారియర్స్ టీమ్‌కు అక్కినేని అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. సీసీఎల్ పాల్గొనే ఎనిమిది జట్లు ఇవే: తెలుగు వారియర్స్ కేరళ స్ట్రైకర్స్ ముంబయి హీరోస్ కర్ణాటక బుల్డోజర్స్ భోజ్‌పురి దబాంగ్స్ చెన్నై రైనోస్ బెంగాల్ టైగర్స్ పంజాబ్ దే షేర్ The Biggest Sportainment Property Celebrity Cricket League (CCL) that brings together actors from 8 Film Industries on to cricket field is back. Parle Biscuits picks the Title Sponsor Rights of the Reloaded #CCL2023 which will start from 18th February 2023. #HappyHappyCCL pic.twitter.com/MzIdBVMy8H — CCL (@ccl) January 28, 2023 -
బ్యాట్ పట్టిన చిరంజీవి..పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
సెలెబ్రిటీ జట్టు Vs హైదరాబాద్ పోలీస్ జట్టు మధ్య మ్యాచ్
-
‘ఈ మ్యాచ్‌కు అందరు ఆహ్వానితులే’
హైదరాబాద్ : సెలెబ్రిటీ జట్టు Vs హైదరాబాద్ పోలీస్ లీగ్ విజేత మధ్య ఎల్బీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ఎవరైనా రావొచ్చని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 2 నెలలుగా నగరంలో ప్రజలకు చేరువయ్యేందుకు హైదరాబాద్ పోలీస్ లీగ్ పేరిట క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించామన్నారు. ఈ లీగ్‌లో మొత్తం 270 జట్లు పాల్గొన్నాయని, 4050 మంది క్రీడాకారులు, సుమారు 40 వేల మంది మమేకమయ్యారని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు రేపు సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడనుందని, ఈ మ్యాచ్‌కు అందరు ఆహ్వానితులేనన్నారు. ఈ మ్యాచ్‌కు హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో పాటు సినీ తారలు చిరంజీవి, వెంకటేష్, నాగర్జున, నాని, అఖిల్, ఇతర నటీ నటులు వస్తున్నారని చెప్పారు. ప్రజలు, పోలీసుల మధ్య మంచి సంబంధాలకు క్రీడలు దోహదం చేస్తాయని కమిషనర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
ఆ ఇష్టంతోనే సినిమాల్లోకి వచ్చా!
‘‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) లో ఆడాలని నా డ్రీమ్. నాలుగైదు సినిమాల్లో నటిస్తేనే ఆడే అర్హత వస్తుందని సినిమాల్లోకి అడుగుపెట్టా’’ అని హీరో అశ్విన్ అన్నారు. అన్నయ్య ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా నటించిన ‘రాజుగారి గది’ ఇటీవలే విడుదలైంది. అశ్విన్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రాన్ని డిసెంబరు 4న విడుదల చేద్దామనుకున్నాం. కానీ నిర్మాతలు సాయి కొర్రపాటి, అనిల్ సుంకర సహకారంతో ఈ నెల 22న విడుదల చేసి నన్ను దసరా హీరో చేశారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను నటించిన ‘జత కలిసే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది’’ అని చెప్పారు. -
తెలుగు వారియర్స్ కు సీసీఎల్-5 టైటిల్
-
తెలుగు వారియర్స్ కు సీసీఎల్-5 టైటిల్
-
సీసీఎల్-5
-
సీసీఎల్ సందడి
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో తారల తళుకుబెళుకులు నగరానికి తరలి వచ్చాయి. ‘చార్మి’ంగ్ గాళ్స్ అందచందాలతో పాటు సినీ క్రికెటర్ల ఆటతీరుతో లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రేక్షకులు ఉర్రూతలూగారు. కర్ణాటక బుల్డోజర్స్తో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ఆటగాళ్లు సిసలైన ఆటను ప్రదర్శించారు. ఈ సీజన్లో నగరంలో ఆడిన తమ తొలి మ్యాచ్‌లోనే క్రిస్ గేల్‌ను తలపించే రీతిలో ‘సిసింద్రీ’ అఖిల్ చూపిన బ్యాటింగ్ తెగువ అభిమానులను కుర్చీల్లో కుదురుగా కూర్చోనీయలేదు. ఓవరాల్‌గా ఓ చక్కటి మ్యాచ్‌ను చూశామన్న సంతృప్తి నగరవాసుల్లో కనిపించింది. -
సీసీఎల్ సందడి
-
నిరాశ పరిచిన తెలుగు వారియర్స్