సెలెబ్రిటీ జట్టు Vs హైదరాబాద్ పోలీస్ లీగ్ విజేత మధ్య ఎల్బీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ఎవరైనా రావొచ్చని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 2 నెలలుగా నగరంలో ప్రజలకు చేరువయ్యేందుకు హైదరాబాద్ పోలీస్ లీగ్ పేరిట క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించామన్నారు.