‘ఈ మ్యాచ్‌కు అందరు ఆహ్వానితులే’ | Hyderabad Police League Vs Celebrity Cricket League All are Welcome  | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 5:50 PM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM

Hyderabad Police League Vs Celebrity Cricket League All are Welcome  - Sakshi

హైదరాబాద్ : సెలెబ్రిటీ జట్టు Vs హైదరాబాద్‌ పోలీస్‌ లీగ్‌ విజేత మధ్య ఎల్బీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే గ్రాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఎవరైనా రావొచ్చని నగర కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 2 నెలలుగా నగరంలో ప్రజలకు చేరువయ్యేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ లీగ్‌ పేరిట క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించామన్నారు. ఈ లీగ్‌లో మొత్తం 270 జట్లు పాల్గొన్నాయని, 4050 మంది క్రీడాకారులు, సుమారు 40 వేల మంది మమేకమయ్యారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ పోలీస్‌ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు రేపు సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ జట్టుతో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుందని, ఈ మ్యాచ్‌కు అందరు ఆహ్వానితులేనన్నారు. ఈ మ్యాచ్‌కు హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో పాటు సినీ తారలు చిరంజీవి, వెంకటేష్‌, నాగర్జున, నాని, అఖిల్‌, ఇతర నటీ నటులు వస్తున్నారని చెప్పారు. ప్రజలు, పోలీసుల మధ్య మంచి సంబంధాలకు క్రీడలు దోహదం చేస్తాయని కమిషనర్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement