సెలబ్రీటీల క్రికెట్ సందడి త్వరలోనే మొదలు కానుంది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు సీసీఎల్ ట్వీట్ చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను క్రికెట్ ఫీల్డ్‌లోకి తీసుకువచ్చే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాపర్టీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ మెగా లీగ్ ఫిబ్రవరి 18, 2023 నుండి ప్రారంభమవుతుందని సీసీఎల్ వెల్లడించింది. తెలుగు వారియర్స్ టీమ్‌కు అక్కినేని అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
సీసీఎల్ పాల్గొనే ఎనిమిది జట్లు ఇవే:
- తెలుగు వారియర్స్
- కేరళ స్ట్రైకర్స్
- ముంబయి హీరోస్
- కర్ణాటక బుల్డోజర్స్
- భోజ్‌పురి దబాంగ్స్
- చెన్నై రైనోస్
- బెంగాల్ టైగర్స్
- పంజాబ్ దే షేర్
The Biggest Sportainment Property Celebrity Cricket League (CCL) that brings together actors from 8 Film Industries on to cricket field is back.
— CCL (@ccl) January 28, 2023
Parle Biscuits picks the Title Sponsor Rights of the Reloaded #CCL2023 which will start from 18th February 2023. #HappyHappyCCL pic.twitter.com/MzIdBVMy8H
Comments
Please login to add a commentAdd a comment