celebrity cricket league team
-
CCL 2023: సీసీఎల్ మళ్లీ వచ్చేస్తుంది.. హీరోలు బ్యాట్ పట్టి సిక్స్ కొడితే..
తమిళసినిమా: క్రికెట్ పోటీలు అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇక సినీ కళాకారుల క్రికెట్ అంటే ప్రత్యేకంగా చెప్పాలా? సందడే సందడి. హీరోలు స్డేడియంలో బ్యాట్ పట్టి సిక్స్ కొడితే.. ఫ్యాన్స్‌కు పునకాలే వస్తాయి. ఇటీవల కరోనా కారణంగా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) జరగలేదు. ఈ నెల 18వ తేదీ నుంచి సీసీఎల్ పోటీల సందడి మొదలవుతోంది. ఇందులో 8 రాష్ట్రాలకు చెందిన సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, కేరళా స్ట్రైకర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. కాగా ముంబాయి హీరోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్, కెప్టెన్‌గా రితేశ్ దేశ్‌ముఖ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెన్నై రైనోస్ జట్టుకు కెప్టెన్ జీవా ఐకాన్ ప్లేయర్‌గానూ, విష్టు విశాల్ స్టార్ క్రీడాకారుడిగా ఉన్నారు. తెలుగు వారియర్స్ జట్టుకు నటుడు వెంకటేశ్ సహ నిర్వాహకుడిగానూ, అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. బోజ్‌పురి దబాంగ్ జట్టుకు మనోజ్ తివారి కెప్టెన్‌గా, కేరళా స్ట్రైకర్స్ జట్టుకు నటుడు మోహన్‌లాల్ సహ నిర్వాహకుడిగా కుంజాకోబోపన్ కెప్టెన్‌గా ఉన్నారు. బెంగాల్ టైగర్స్ జట్టుకు బోనీకపూర్ సహ నిర్వాహకుడిగా, జిసుసేన్ గప్లా కెప్టెన్‌గా ఉండనున్నారు. కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు సుదీప్, పంజాబ్ ది ఫేర్ జట్టుకు సోనూసూద్ కెపె్టన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 18వ తేదీ నుంచి రాయ్‌పూర్, జైపూర్, బెంగళూర్, త్రివేండ్రం, జోద్పూర్, హైదరాబాద్‌లలో ఈ పోటీలు జరగనున్నాయి. అదే విధంగా మార్చి 19వ తేదీ ఫైనల్ పోరు జరుగుతుంది. ఈ పోటీలు జీటీవీలో లైవ్ ప్రసారం అవుతాయని నిర్వాహకులు బుధవారం ఉదయం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పోటీల కోసం గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెన్నై రైనోస్ జట్టు కెప్టెన్ జీవా తెలిపారు. -
త్వరలోనే క్రికెట్ పండగ.. ఎనిమిది జట్లతో మెగా టోర్నీ
సెలబ్రీటీల క్రికెట్ సందడి త్వరలోనే మొదలు కానుంది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు సీసీఎల్ ట్వీట్ చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఎనిమిది ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను క్రికెట్ ఫీల్డ్‌లోకి తీసుకువచ్చే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్లీ తిరిగి వచ్చింది. ఈ మెగా లీగ్ ఫిబ్రవరి 18, 2023 నుండి ప్రారంభమవుతుందని సీసీఎల్ వెల్లడించింది. తెలుగు వారియర్స్ టీమ్‌కు అక్కినేని అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. సీసీఎల్ పాల్గొనే ఎనిమిది జట్లు ఇవే: తెలుగు వారియర్స్ కేరళ స్ట్రైకర్స్ ముంబయి హీరోస్ కర్ణాటక బుల్డోజర్స్ భోజ్‌పురి దబాంగ్స్ చెన్నై రైనోస్ బెంగాల్ టైగర్స్ పంజాబ్ దే షేర్ The Biggest Sportainment Property Celebrity Cricket League (CCL) that brings together actors from 8 Film Industries on to cricket field is back. Parle Biscuits picks the Title Sponsor Rights of the Reloaded #CCL2023 which will start from 18th February 2023. #HappyHappyCCL pic.twitter.com/MzIdBVMy8H — CCL (@ccl) January 28, 2023 -
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ అంబాసిడర్‌గా త్రిష
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సందడి మొదలవ్వనుంది. ఈ సీసీఎల్‌లో చెన్నై రైనోస్ టీమ్ ప్రచారకర్తగా చెన్నై చిన్నది త్రిష ఎంపికైంది. నటుడు విశాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ టీమ్‌కు త్రిష అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ టీమ్‌కు నటి తమన్నాతో సహా పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనకు రాగా చివరికి చెన్నై బ్యూటీ త్రిషను ఎంపిక చేసినట్లు చెన్నై రైనోస్ డెరైక్టర్ శ్రీకాంత్ బాబు వెల్లడించారు. తమ టీమ్ ప్రచారకర్తగా త్రిషను నియమించడం సంతోషకరంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ చుట్టొచ్చిన త్రిష తాజాగా కన్నడ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం ఈ సుందరి పునీత్ రాజ్‌కుమార్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హూబ్లీ సమీపంలోని సీమాంధ్ర ప్యాలెస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సీసీఎల్ ప్రచార కర్తగా ఎంపికైన విషయం గురించి త్రిష మాట్లాడుతూ మూడేళ్లుగా సీసీఎల్ నిర్వాహకులు తనను సంప్రదిస్తూనే ఉన్నారన్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల కుదరలేదన్నారు. ఈ లీగ్‌కు అంబాసిడర్‌గా ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు. తాను తొలుత ప్రేమించేది చెన్నైనేనన్నారు. అలాంటి చెన్నై రైనోస్ టీంలో తానూ భాగం కావడం ఆనందంగా ఉందని త్రిష పేర్కొన్నారు.