తెలుగులో పవన్ కల్యాణ్ కొడుకు సినిమా | Pawan Kalyan's son's debut film to release in Telugu too | Sakshi
Sakshi News home page

తెలుగులో పవన్ కల్యాణ్ కొడుకు సినిమా

Published Sun, Sep 7 2014 10:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

తెలుగులో పవన్ కల్యాణ్ కొడుకు సినిమా - Sakshi

తెలుగులో పవన్ కల్యాణ్ కొడుకు సినిమా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. అకీరా తన తల్లి రేణు దేశాయ్  స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరాఠీ సినిమా 'ఇష్క్ వాలా లవ్'లో అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. పవన్ అభిమానుల కోసం ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. రేణు దేశాయ్ ఫేస్బుక్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.

'ఇష్క్ వాలా లవ్ చిత్రం తెలుగు డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలుగు చిత్రం ట్రైలర్ను త్వరలో విడుదల చేస్తాం' అని రేణు దేశాయ్ తెలిపారు. రేణు పవన్తో విడిపోయినా అతణ్ని ప్రశంసిస్తూ తరచూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంటారు. అకీరా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్న ఫొటోలను రేణు గతంలో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement