పవన్‌తో అకీరా, లెజినోవా: రేణు ట్వీట్‌ | Renu Desai Tweets on Akira With Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌తో అకీరా, లెజినోవా: రేణు ట్వీట్‌

Published Sat, Jun 23 2018 4:54 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Renu Desai Tweets on Akira With Pawan Kalyan - Sakshi

సాక్షి, సినిమా: జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ఆయన కుమారుడు అకీరా నందన్‌ ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమట ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శుక్రవారం ఉదయం గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్‌ ముందు రోజు రాత్రి విజయవాడలోని ఓ హోటల్‌లో కొడుకు అకీరానంద్‌, భార్య అన్నాలెజినోవాతో కలిసి రావడం కొంతమంది కంట పడింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అకీరా విజయవాడకు రావడాన్ని ప్రశ్నిస్తూ కొంత మంది రేణుకి మెసేజ్‌ చేశారట. దీనికి రేణు తన ట్విటర్‌ ద్వారా స్పందించారు.  

‘అకీరా తన సెలవుల్లో కొన్ని రోజులు పవన్‌(నాన్న)తో కలిసి గడపాలనుకున్నాడు. అతడు హైదరాబాద్‌కు రాలేదు. ప్రస్తుతం అకీరా కల్యాణ్‌ గారితో కలిసి  విజయవాడలో ఉన్నాడు. అప్పటి నుంచి నాకు విరామం లేకుండా మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ఈ ట్వీట్‌ చేస్తున్నా’ అని రేణు దేశాయ్‌ పేర్కొన్నారు. 

నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్‌ తన పిల్లల గురించి సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేణుదేశాయ్ తన కొడుకు అకీరాను జూనియర్ పవర్ స్టార్ అని కొంతమంది సోషల్ మీడియాలో అంటే  ఫైర్ అయ్యింది. అకీరాను అలా పిలవద్దంటూ సీరియస్ అయ్యింది. తన కొడుకు సొంతంగా ఎదిగేందుకు తాను భరోసానిస్తున్నానని.. అకీరాను తనలాగే గుర్తించాలని అభిమానులను కోరింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement