పవన్‌ అభిమానిపై రేణు ఫైర్‌ | Renu Desai Fires On Pawan Fan | Sakshi
Sakshi News home page

Mar 3 2018 2:28 PM | Updated on Mar 22 2019 5:33 PM

Renu Desai Fires On Pawan Fan - Sakshi

సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్‌పై రేణుదేశాయ్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ నుంచి విడిపోయిన తరువాత చాలా సందర్భాల్లో రేణు అభిమానుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి ఓ కవిత కారణంగా ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. తన గతానికి సంబంధించిన ఆవేదనను కవిత రూపంలో రాసుకున్న రేణు.. ఆ కవితను తానే స్వయంగా చదివి వీడియో రూపంలో యూట్యూబ్‌లో ఉంచారు.

దీంతో ఈ వీడియోపై పవన్‌ అభిమాని స్పందిస్తూ ‘మీ కారణంగా పవన్‌ రాజకీయ పార్టీలకు టార్గెట్ అవుతున్నారు. మీరు పూర్తి అవగాహన లేకుండా కామెంట్‌ చేయటం. మీడియా ఆ విషయాన్ని హైలెట్‌ చేయటం. మీరు మీ పనిచేసుకుంటూ సంతోషంగా ఉండండి. పవన్‌ కళ్యాణ్ కు సంబంధించిన విషయాలను షేర్‌ చేయకండి’ అంటూ కామెంట్‌ చేశాడు.

ఈ కామెంట్‌ పై రేణు దేశాయ్‌ సీరియస్‌ అయ్యారు. ‘నా కవిత కారణంగా అతను(పవన్‌ కళ్యాణ్‌) ఎలా టార్గెట్‌ అవుతాడు..? మీరు మీ పని చేసుకోండి. నేను సోషల్‌ మీడియాలో ఏదైన పోస్ట్‌ చేసినప్పుడు వాటిపై సంస్కారంలేకుండా స‍్పందించకండి’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. గతంలోనూ పలు సందర్భాల్లో పవన్‌ అభిమానుల వల్ల  తనకు ఎదురవుతున్న ఇబ‍్బందులను రేణు బయటపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement