
సినీ నటి రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. పవన్ కల్యాణ్ మాజీ భార్య అని పిలిపించుకోవడానికి కూడా రేణు దేశాయ్ ఇష్టపడరు. పవన్ తనతో కలిసి ఉన్న సమయంలోనే మరొ మహిళతో సన్నిహితంగా ఉన్నాడని పలు సందర్భాల్లో విమర్శించారు. ఇక రీసెంట్‌గా తన కొడుకు అకీరాని ‘మా అన్న కొడుకు’అని ఫ్యాన్స్ సంబోధించడంపై దేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అకీరా నా కొడుకు... మీ అన్న కొడుకు ఏంటి?. ఒక తల్లికే పుట్టావా? సరిగా మాట్లాడటం నేర్చుకో’ అని రేణు ఫైర్ అయ్యారు.
నాలుగు రోజుల క్రితం మొదలైన ఈ సోషల్ మీడియా వార్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది రేణుని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్స్ మార్చుకోండి.. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోండి అంటూ రేణు దేశాయ్‌కి ఉచిత సలహాలు ఇస్తున్నారు.
పవన్ అభిమానుల సలహాలను రేణు దేశాయ్ తప్పుబట్టారు. ‘సమాజంతో ఇదే ప్రాబ్లమ్. ఎవరి కోసమో నేను మారాలా?. మీరు చెప్పినట్లు జీవించడానికి నేను ఏమి తప్పు చేశాను. సలహా ఇవ్వడం చాలా ఈజీ. బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది’అని ఇన్‌స్టా స్టోరీలో రేణు దేశాయ్ పోస్ట్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment