పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రేణుదేశాయ్ | 8th April 04 I held you in my hands renudeshai twitts | Sakshi
Sakshi News home page

పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రేణుదేశాయ్

Published Fri, Apr 8 2016 10:55 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రేణుదేశాయ్ - Sakshi

పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రేణుదేశాయ్

పూణె: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ శుక్రవారం ఒకే రోజు మూడు పండుగలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముద్దుల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు ఒకటి కాగా. మరో ముఖ్యమైనది పవన్ కళ్యాణ్  లేటెస్ట్  మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల. దీంతోపాటు తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది.

 

ఈ సందర్భంగా ఏప్రిల్ 8కి సంబంధించి మధుర జ్ఞాపలకాలను రేణు దేశాయ్ నెమరు వేసుకున్నారు. ముద్దుల కొడుకు అకీరా నందన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.  కుమారునితో ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

'2004 ఏప్రిల్ 8న నిన్ను ఓ బుజ్జి బాబుగా నా చేతిలోకి మొదటిసారిగా తీసుకున్నా. అప్పుడే 12 ఏళ్లు నిండి నా అంత పెద్దవాడివయ్యావు. ఆధ్యని ప్రేమగా చూసుకునే అన్నగా, నాకో మంచి కొడుకుగా మా మనసులు దోచుకున్నావు. నువ్వు నా కొడుకుగా లభించడం నా అదృష్టం. తల్లిగా ఎంతగానో గర్వపడుతున్నా. నా కొడుకు చూస్తుండగానే పెద్దవాడవుతున్నాడు. నా భుజాల దగ్గరకు వచ్చేశాడు. ఐ లవ్ యూ అకీరా.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్' అంటూ రాసి ఉన్న ఫోటోను రేణూ దేశాయ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాగా ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్, అక్కినేని అఖిల్‌ కు రేణు దేశాయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. యాదృచ్ఛికంగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అఖిల్, అర్జున్, అకీరా నందన్‌ల పేర్లు 'ఏ' తోనే ప్రారంభమౌతున్నాయని పేర్కొన్నారు. అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement