renudesai
-
సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సింగర్ సునీత కు వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక జనవరిలో రామ్‌ను వివాహం చేసుకుంటున్నట్లు సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో వీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ హజరయ్యారు. (చదవండి: అతికొద్ది మంది సమక్షంలో సునీత పెళ్లి) కేవలం కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, యాంకర్ సుమ కనకాలలు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్‌కు హీరో నితిన్ హోస్ట్‌గా వ్వవహరించి.. కార్యక్రమానికి సంబంధించి అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నాడట. మరో విషయం ఏంటంటే సునీతకు కాబోయే భర్త రామ్‌కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంలో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) -
రేణు దేశాయ్...ఓ విషాద అనుభవం
ముంబై: తరచూ తన మనసులోని భావాలను, ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే నటి రేణు దేశాయ్ తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. పవన్‌కళ్యాణ్‌తో తాను కలిసి నటించిన బద్రి సినిమాకు సంబంధించి ఓ విషయాన్ని పంచుకున్నారు. అయితే ఈ సారి రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ నాడు జరిగిన ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురైంది. సినిమా విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయని గుర్తు చేసుకున్న రేణు, ఆ సినిమాలోని కొన్ని సన్నివేశ షూటింగ్ విషయాలను గుర్తు చేసుకున్నారు. అమితమైన దుంఖాన్ని దిగమింగి ఓఫన్నీ సన్నివేశంలో తాను నటించిన తీరుగురించి చెప్పుకొచ్చారు. దీనికి తార్కాణంగా ఓ ఫోను కూడా ఇన్స్టాగ్రామ్ లోపోస్ట్ చేశారు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటోను చూస్తే తన కళ్లలో నీళ్లు తిరగడాన్ని గమనించొచ్చని పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఈ ఫోటోలో గ్లామర్ మాత్రమే కనిపిస్తుందని.. కానీ, దీని వెనుక ఎవరికీ తెలియని ఓ విషాద సంఘటన ఉందన్నారు. పుణేలో తన స్నేహితురాలు ఓ బైక్ యాక్సిడెంట్లో చనిపోయినవార్త ఆసమయంలో తనకు అందిందని, అది విని తట్టుకోలేకపోయాననీ, అయినా దుంఖాన్ని దిగమింగి షూటింగ్ పూర్తి చేశానన్నారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే... తన కళ్లలో నీటి తడిని చూడొచ్చని తన పోస్ట్‌లో చెప్పారు. ఆ సమయంలో బాధను దాచుకొన్నప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయని, అందుకు సాక్ష్యం ఈ ఫోటోనే అని రేణుదేశాయ్ ఆ ఫోటోను ట్వీట్ చేశారు. An extremely strong memory from the shoot of the movie...If you notice closely, I have tears in… https://t.co/cPuf9VNVwm — renu (@renuudesai) April 20, 2017 -
రేణు..పవన్..ఓ ఇంటర్వ్యూ
-
రేణు..పవన్..ఓ ఇంటర్వ్యూ
నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితంపై వెకిలిగా మాట్లాడుతున్నవారిపై స్పందించారు. వెల్ విషర్స్, అభిమానులు తన పట్ల చూపిస్తున్న ఆదరణపై కృతజ్ఞతలు చెప్పిన ఆమె ట్విట్టర్ లో ఒక లేఖను పోస్ట్ చేశారు. దీంతొపాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఇది చూశాక అయిన వాళ్లు తన ధోరణిమార్చుకోవాలంటూ కోరారు. దీంతోపాటుగా తెలుగును ఇంగ్లీషు లో చెప్పిన ఆమె ఏమైనా వ్యాకరణ దోషాలుంటే క్షమించాలని కోరారు. అచ్చ తెలుగులో కాకపోయినా.. ఆంగ్లంలో టైప్ చేసినప్పటికీ, ఎలాంటి తప్పులు లేకుండా ఉండడం విశేషం. అలాగే ప్రపంచం మొత్తం పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతున్నపుడు తాను మాత్రం ఎందుకు మాట్లాడకూడదని రేణు ప్రశ్నించారు. 17 ఏళ్లుగా తామిద్దరం మంచి స్నేహితులమని , పదకొండేళ్ల పాటు పవన్ కు తాను భార్యగా ఉన్నానని, తన బిడ్డలకు ఆయన తండ్రి అని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా తమ పిల్లల కోసం అప్పుడప్పుడూ పవన్, తాను కలుస్తున్నామని , పవన్ గురించి తాను మాట్లాడకూడదని కొంతమంది ఎందుకు ప్రశ్నిస్తున్నారో తనకు అర్థం కాలేదంటూ రేణూ దేశాయ్ ఒకింత ఆగ్రహాన్ని ప్రకటించారు. I will always be thankful to my true well wishers&fans for d love&care... (Telugu grammar tappu unte please excuse) pic.twitter.com/TmcIiqAiDo — renu (@renuudesai) 14 September 2016 -
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రేణుదేశాయ్
పూణె: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ శుక్రవారం ఒకే రోజు మూడు పండుగలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముద్దుల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు ఒకటి కాగా. మరో ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల. దీంతోపాటు తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా ఏప్రిల్ 8కి సంబంధించి మధుర జ్ఞాపలకాలను రేణు దేశాయ్ నెమరు వేసుకున్నారు. ముద్దుల కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. కుమారునితో ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. '2004 ఏప్రిల్ 8న నిన్ను ఓ బుజ్జి బాబుగా నా చేతిలోకి మొదటిసారిగా తీసుకున్నా. అప్పుడే 12 ఏళ్లు నిండి నా అంత పెద్దవాడివయ్యావు. ఆధ్యని ప్రేమగా చూసుకునే అన్నగా, నాకో మంచి కొడుకుగా మా మనసులు దోచుకున్నావు. నువ్వు నా కొడుకుగా లభించడం నా అదృష్టం. తల్లిగా ఎంతగానో గర్వపడుతున్నా. నా కొడుకు చూస్తుండగానే పెద్దవాడవుతున్నాడు. నా భుజాల దగ్గరకు వచ్చేశాడు. ఐ లవ్ యూ అకీరా.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్' అంటూ రాసి ఉన్న ఫోటోను రేణూ దేశాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్, అక్కినేని అఖిల్ కు రేణు దేశాయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. యాదృచ్ఛికంగా ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అఖిల్, అర్జున్, అకీరా నందన్ల పేర్లు 'ఏ' తోనే ప్రారంభమౌతున్నాయని పేర్కొన్నారు. అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. I love you Akiriiii ❤️ #HappyBirthdayAkira pic.twitter.com/sxjdzkX4tj — renu (@renuudesai) 8 April 2016