రేణు దేశాయ్‌...ఓ విషాద అనుభవం | renuudesai's An extremely strong memory from shoot | Sakshi
Sakshi News home page

రేణు దేశాయ్‌...ఓ విషాద అనుభవం

Published Thu, Apr 20 2017 8:06 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

రేణు దేశాయ్‌...ఓ విషాద అనుభవం

రేణు దేశాయ్‌...ఓ విషాద అనుభవం

ముంబై: తరచూ తన మనసులోని భావాలను, ఉద్వేగాన్ని  సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే  నటి రేణు దేశాయ్‌ తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్‌ లో  పంచుకున్నారు.  పవన్‌కళ్యాణ్‌తో  తాను కలిసి నటించిన బద్రి సినిమాకు సంబంధించి ఓ విషయాన్ని పంచుకున్నారు.  అయితే ఈ సారి  రేణు దేశాయ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఆ నాడు జ‌రిగిన ఓ చేదు జ్ఞాప‌కాన్ని గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురైంది.  
సినిమా విడుద‌లై నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయని గుర్తు చేసుకున్న రేణు, ఆ సినిమాలోని కొన్ని సన్నివేశ  షూటింగ్‌ విషయాలను గుర్తు చేసుకున్నారు.  అమితమైన  దుంఖాన్ని దిగమింగి ఓఫన్నీ సన్నివేశంలో తాను నటించిన తీరుగురించి చెప్పుకొచ్చారు. దీనికి తార్కాణంగా ఓ ఫోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ లోపోస్ట్‌ చేశారు.  ఆ స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోను చూస్తే తన క‌ళ్ల‌లో నీళ్లు తిరగ‌డాన్ని గమనించొచ్చని పేర్కొన్నారు.   ప్రేక్షకులకు  ఈ ఫోటోలో  గ్లామర్‌ మాత్రమే కనిపిస్తుందని.. కానీ, దీని వెనుక ఎవరికీ తెలియని ఓ విషాద  సంఘటన ఉందన్నారు.  

పుణేలో త‌న‌ స్నేహితురాలు ఓ బైక్‌ యాక్సిడెంట్‌లో చనిపోయినవార్త ఆసమయంలో తనకు అందిందని, అది  విని తట్టుకోలేకపోయాననీ, అయినా దుంఖాన్ని దిగమింగి  షూటింగ్‌  పూర్తి చేశానన్నారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే... తన కళ్లలో నీటి తడిని చూడొచ్చని తన  పోస్ట్‌లో   చెప్పారు.  ఆ సమయంలో బాధను దాచుకొన్నప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయని, అందుకు సాక్ష్యం ఈ ఫోటోనే అని రేణుదేశాయ్ ఆ ఫోటోను ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement