Badri
-
వైరల్ : పవన్ కల్యాణ్‌తో ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్
రేణు దేశాయ్, పవన్‌కల్యాణ్ జంటగా నటించిన చిత్రం బద్రీ. ఈ సినిమా వచ్చి నేటికి (మంగళవారం) 21 ఏళ్లు పూర్తవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన నిలిచిన ఈ మూవీలో డైలాగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అమీషా పటేల్ మరో హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ డెబ్యూ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. బద్రీ విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేణు దేశాయ్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏ చికితా'.. పాటకు సంబంధించిన ఫోటోను షేర్ చేసుకుంది. ఇందులో పవన్‌కల్యాణ్ తుపాకీ పట్టుకొని ఉండగా, రేణు దేశాయ్ తన ముఖాన్ని చున్నీతో కప్పుకుంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు దీన్నే సన్‌స్క్రీన్‌గా ఉపయోగించినట్లు ఫన్నీగా కామెంట్ చేసింది. ఇక ఈ సినిమాతో రేణు దేశాయ్ హీరోయిన్గా పరిచయం అయ్యింది. బద్రీ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్, రేణుల మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం సహజీవనం అనంతరం ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నా ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత పవన్ అన్నా లెజ్నోవాని పెళ్లి చేసుకోగా, రేణు దేశాయ్ సైతం ఓ బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు రేణు దేశాయ్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. View this post on Instagram A post shared by renu (@renuudesai) చదవండి : హీరోయిన్ అంజలా జవేరీ భర్త 'విలన్' అని మీకు తెలుసా? పెళ్లికి రెడీ అయిన కమెడియన్లు, ఎప్పుడంటే? -
టాలీవుడ్లో రేణు దేశాయ్ రీ-ఎంట్రీ
‘బద్రి, జానీ’ సినిమాలతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణు దేశాయ్ మళ్లీ తెలుగులోకి రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. కానీ ఈసారి మేకప్ వేసుకొని కాదు. మెగాఫోన్ పట్టుకొని! 2014లో డైరెక్టర్‌గా ’ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు రేణు దేశాయ్. ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులోనూ డబ్ చేశారు. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవ్వడానికి సిద్ధమయ్యారు. కథ, స్క్రీన్‌ప్లే రెడీ. ఈ విషయమై రేణు దేశాయ్‌ని ‘సాక్షి’ సంప్రదించగా– ‘‘అవును.. డైరెక్టర్‌గా నా ఫస్ట్ తెలుగు సినిమా కోసం కథ రెడీ చేశాను. రైతులకు సంబంధించిన సమస్యల మీద ఈ సినిమా ఉంటుంది. స్క్రీన్‌ప్లే వర్క్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇందులో నేను నటించను, కేవలం డైరెక్టర్‌ను మాత్రమే’’ అని అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఓ ప్రముఖ హీరో నటించనున్న చిత్రంలో రేణు ‘వదిన’ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. ‘‘ఇలాంటివి ఎవరు కల్పిస్తారో అర్థం కావడం లేదు. నేను ఏ తెలుగు సినిమాకీ ఓకే చెప్పలేదు’’ అని రేణు స్పష్టం చేశారు. -
రేణు దేశాయ్...ఓ విషాద అనుభవం
ముంబై: తరచూ తన మనసులోని భావాలను, ఉద్వేగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే నటి రేణు దేశాయ్ తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. పవన్‌కళ్యాణ్‌తో తాను కలిసి నటించిన బద్రి సినిమాకు సంబంధించి ఓ విషయాన్ని పంచుకున్నారు. అయితే ఈ సారి రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ నాడు జరిగిన ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురైంది. సినిమా విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయని గుర్తు చేసుకున్న రేణు, ఆ సినిమాలోని కొన్ని సన్నివేశ షూటింగ్ విషయాలను గుర్తు చేసుకున్నారు. అమితమైన దుంఖాన్ని దిగమింగి ఓఫన్నీ సన్నివేశంలో తాను నటించిన తీరుగురించి చెప్పుకొచ్చారు. దీనికి తార్కాణంగా ఓ ఫోను కూడా ఇన్స్టాగ్రామ్ లోపోస్ట్ చేశారు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటోను చూస్తే తన కళ్లలో నీళ్లు తిరగడాన్ని గమనించొచ్చని పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఈ ఫోటోలో గ్లామర్ మాత్రమే కనిపిస్తుందని.. కానీ, దీని వెనుక ఎవరికీ తెలియని ఓ విషాద సంఘటన ఉందన్నారు. పుణేలో తన స్నేహితురాలు ఓ బైక్ యాక్సిడెంట్లో చనిపోయినవార్త ఆసమయంలో తనకు అందిందని, అది విని తట్టుకోలేకపోయాననీ, అయినా దుంఖాన్ని దిగమింగి షూటింగ్ పూర్తి చేశానన్నారు. అయితే జాగ్రత్తగా గమనిస్తే... తన కళ్లలో నీటి తడిని చూడొచ్చని తన పోస్ట్‌లో చెప్పారు. ఆ సమయంలో బాధను దాచుకొన్నప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయని, అందుకు సాక్ష్యం ఈ ఫోటోనే అని రేణుదేశాయ్ ఆ ఫోటోను ట్వీట్ చేశారు. An extremely strong memory from the shoot of the movie...If you notice closely, I have tears in… https://t.co/cPuf9VNVwm — renu (@renuudesai) April 20, 2017 -
న్యూస్ ప్రజెంటర్ బద్రి అంత్యక్రియలు పూర్తి
విజయవాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ9 న్యూస్ ప్రజెంటర్ వీరభద్రయ్య(బద్రి)కి పలువురు నివాళులర్పించారు. ద్వారకాతిరుమల వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బద్రి భౌతికకాయాన్ని విజయవాడ సూర్యారావుపేటలోని తండ్రి ఇంటికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా, విజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బద్రి భార్య లక్ష్మీసుజాతను బయటకు తీసుకువచ్చి భర్తను కడసారి చూపించారు. దీంతో ఆమె కన్నీరు మున్నీరైంది. అనంతరం బద్రి, చిన్న కుమారుడు సాయి సాత్విక్ భౌతికకాయాలకు కృష్ణలంకలోని స్వర్గపురిలో దహనసంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు, సహచరులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బద్రి భార్య లక్ష్మీసుజాత, పెద్ద కొడుకు సాయిదీపక్(13) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాయిదీపక్ వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నాడు. ఇంకో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. -
న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం
-
జీవితం ఓ యుద్ధం!
పూరి... చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ మాట్లాడిన ప్రతి మాటలోనూ కంటెంట్ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. పూరి... విజయాల కంటే పరాజయాల నుంచే ఎక్కువ నేర్చుకున్నాడు. ఒకప్పుడు చిన్న చెరువులాగా... నదిలాగే ఉండేవాడు. ఇప్పుడు తనో సముద్రం. ఆ కెరటాల గుండె చప్పుడుని డీకోడ్ చేస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. పూరి థాట్ ప్రాసెస్‌ని మలుపు తిప్పిన ‘5’ అంశాలు ఓసారి క్లోజప్‌లో... నా దృష్టిలో వేరే వాళ్ల కోణంలో ఆలోచించడమే జ్ఞానం! పుస్తకం: చందమామ చిన్నప్పుడు చందమామ బాగా చదివేవాణ్ణి. అందులో ఇష్టమైన కథలు చాలా ఉన్నాయి కానీ, ఐదవ తరగతిలో చదివిన ఒక కథ నన్ను బాగా ప్రభావితం చేసింది... ఓ పల్లెటూరు. అక్కడో వ్యక్తి. బుర్ర నిండా జ్ఞానాన్ని నింపుకోవాలన్నది అతని కల. అందుకే హిమాలయాల దారి పట్టాడు. ఒకటీ రెండూ కాదు... 40 ఏళ్లు అక్కడే ఉండి బోలెడంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఊళ్లోవాళ్లతో పంచుకోవాలనుకుని, సొంత ఊరికి బయలుదేరతాడు. ఊరి మొదట్లోనే అతనికి ఓ కసాయివాడు మేకను నరుకుతూ కనిపిస్తాడు. ఆ జ్ఞానికి మనసు ఊరుకోలేదు. ‘‘నాయనా.. జీవహింస మంచిది కాదు. నువ్వు వచ్చే జన్మలో మేకవై పుడతావు. అది మనిషై పుట్టి, నిన్నూ ఇలాగే హింస పెడుతుంది. అందుకే ఇలాంటి పనులు మానేసేయ్’’ అని హితబోధ చేస్తాడు. అప్పుడా కసాయివాడు ‘‘మీరు చెప్పిన లెక్క ప్రకారం గతజన్మలో వీడు నన్నిలాగే నరికేసుంటాడు. అందుకే రుణం తీర్చుకుంటున్నాను... ఇదో సైకిల్. డోన్ట్ వర్రీ’’ అని చెప్తాడు. ఆ మాటలకు జ్ఞాని అవాక్కవుతాడు! ఓ మామూలు కసాయి వాడికున్న ఇంగితజ్ఞానం కూడా ఇంత సాధన చేసిన తనకు లేనందుకు సిగ్గుపడతాడు ఆ జ్ఞాని. ఎందుకో ఈ కథ ఆ వయసులో నాకు బాగా ఆనింది! ఓ రకంగా చెప్పాలంటే... నా దృక్పథాన్ని మార్చింది! మనమెప్పుడూ మన పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం. వేరే వాళ్ల కోణంలో ఆలోచించడమే జ్ఞానం! ప్రశాంతంగా ఉన్న నా చెరువులో బండరాళ్లు వేసింది వీళ్లే! వ్యక్తి: ఒకరు కాదు ఐదుగురు! నా థాట్ ప్రాసెస్ మారడానికి కారణమైన వ్యక్తులు ఇద్దరు. ఒకరు రజనీష్, ఇంకొకరు రామ్‌గోపాల్‌వర్మ. వీళ్లిద్దరూ మంచి చెబుతారో, చెడు చెబుతారో నాకైతే తెలీదు కానీ... అవతలి వాళ్లని డిస్ట్రబ్ చేయగలరు. మనం డిస్ట్రబ్ అయితే కానీ, ఎప్పుడూ బుర్రపెట్టి ఆలోచించం. అదర్ యాంగిల్ నుంచి ఆలోచించడం ఎలానో వీరిద్దరి దగ్గరనుంచీ నేర్చుకున్నాను. ఎందుకంటే ఇద్దరూ రెబల్సే. ప్రశాంతంగా ఉన్న నా చెరువులో పెద్ద పెద్ద బండరాళ్లు వేసి డిస్ట్రబ్ చేసింది వీళ్లిద్దరే. అలా వీళ్లుగాక నన్ను డిస్ట్రబ్ చేసినవాళ్లు ఇంకో ముగ్గురు ఉన్నారు. శ్రీశ్రీ- ఆయన పొయిట్రీ చదువుతుంటేనే మనమో అగ్నిపర్వతంలా మారిపోతాం. ముఖ్యంగా ‘మహాప్రస్థానం’. ఎన్నిసార్లు చదివినా అదే ఫీలింగ్! చలంగారు- ‘మైదానం’ అయితే ఓ విప్లవమే! ముప్పాళ్ల రంగనాయకమ్మగారు- ‘రామాయణ కల్పవృక్షం’ 40 ఏళ్ల క్రితమే చాలా డేరింగ్‌గా రాశారు. నాకు తెలిసి ఇండియాలో అంతటి రెబల్ లేడీ రైటర్ ఎవ్వరూ లేరు! వీళ్లందరి ప్రభావం నాపై చాలా ఉంది. ప్రేక్షకుణ్ణి అసహనానికి గురిచేయకూడదని తెలుసుకుంది ఆరోజే! సంఘటన: ‘బద్రి’ రిలీజ్ రోజు నా తొలి సినిమా ‘బద్రి’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. సెకండాఫ్‌లో కొంత ఫుటేజ్ ఎక్కువ అనిపించింది. అయినా పర్లేదనుకుని ఎడిటింగ్ చేయకుండానే రిలీజ్ చేసేశాం. థియేటర్లో పబ్లిక్‌తో కూర్చుని చూస్తుంటే, నేను ఎక్కడైతే లెంగ్త్ ఎక్కువైందనుకున్నానో సరిగ్గా అక్కడే ప్రేక్షకులు గొల్లుమని అసహనంతో అరిచారు. ఒకరిద్దరు సిగరెట్ తాగడానికి బయటకు వెళ్లిపోయారు. నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత ఫీలింగ్ వచ్చింది. అప్పటివరకూ అంత మంచిగా సినిమా తీశాడు కదా అని ప్రేక్షకులు ఏమాత్రం ఎక్స్క్యూజ్ చేయరు. అసలే బయట లక్షాతొంభై టెన్షన్లతో వేగుతూ ఉండే ప్రేక్షకుడు థియేటర్‌కు రావడమే ఎక్కువ. అలాంటి ప్రేక్షకుణ్ణి అసహనానికి గురి చేయకూడదన్నది ఆ రోజు తెలుసుకున్నాను! అందుకే నా సినిమాలెప్పుడూ ప్యాక్డ్గా ఉంటాయి. ఇంతటి చిన్న ఇన్సిడెంట్ కూడా వృత్తిపరంగా నాకంతటి గొప్ప పాఠం నేర్పింది! ఇక్కడ మంచితనమూ ఆయుధమే, దుర్మార్గమూ ఆయుధమే! కోట్: 'All is fair in war' యుద్ధంలో ఏదైనా సమంజసమే- అన్న ఈ కోట్ని నా హార్ట్‌లో, మైండ్‌లో పర్మినెంట్‌గా స్టోర్ చేసుకున్నా! జీవితంలో ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా! జీవితం ఓ యుద్ధం. దేవుడు మనల్ని వార్‌జోన్‌లో పడేశాడు. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. నా దృష్టిలో... ఇతర జంతువులనుంచి రక్షించుకోవడానికి ఆయుధం పుట్టింది. ఎండా వానల నుంచి రక్షించుకోవడానికి ఇల్లు పుట్టింది. ప్రకృతి నుంచి తప్పించుకోవడానికి వైద్యం పుట్టింది. మనిషి నుంచి మనిషిని కాపాడుకోవడానికి మానవత్వం పుట్టింది. నిస్సహాయత నుంచి దైవం పుట్టింది. ఇక్కడ మంచితనమూ ఆయుధమే. దుర్మార్గమూ ఆయుధమే! ఏదో ఒక పేరు చెప్పుకుని మనల్ని మనం కాపాడుకోవాలి... లేకపోతే మనల్ని చంపేస్తారు! నా హీరోల క్యారెక్టర్లు స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం ఆ నాయకుడే! సినిమా: నాయకుడు డిగ్రీలో ఉండగా అనకాపల్లిలో చూశాను ఈ సినిమా. చూసింది రెండుసార్లే కానీ, ఇప్పటికీ ప్రతి సీనూ గుర్తుంది. ఈ సినిమాలో కమల్‌హాసన్ చేసిన వీరినాయుడు క్యారెక్టర్ నన్ను బాగా ప్రభావితం చేసింది. ఇందులో వీరినాయుడు చేసేవన్నీ సంఘవ్యతిరేక కార్యకలాపాలే! చిత్రమేంటంటే అవన్నీ మనకు పాజిటివ్‌గా అనిపిస్తాయి. ‘పదిమందికి మేలు చేసే పని ఎప్పుడూ తప్పు కాదు’ అని వీరినాయుడు తండ్రి ఓ డైలాగ్ చెబుతాడు. దాంతో మనం కన్విన్స్ అయిపోయి, వీరినాయుడి పాత్రలో లీనమైపోతాం. స్ట్రగుల్స్, రకరకాల ఫేజ్‌లతో ఆ పాత్రకో స్ట్రాంగ్ మెంటాల్టీ ఏర్పడింది. అదే నన్ను ఇన్‌స్పయిర్ చేసింది. నా సినిమాల్లో హీరో క్యారెక్టర్లు స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం ఈ సినిమానే! - సంభాషణ: పులగం చిన్నారాయణ