‘బద్రి, జానీ’ సినిమాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణు దేశాయ్ మళ్లీ తెలుగులోకి రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. కానీ ఈసారి మేకప్ వేసుకొని కాదు. మెగాఫోన్ పట్టుకొని! 2014లో డైరెక్టర్‌గా ’ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు రేణు దేశాయ్. ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులోనూ డబ్ చేశారు. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవ్వడానికి సిద్ధమయ్యారు. కథ, స్క్రీన్‌ప్లే రెడీ.
ఈ విషయమై రేణు దేశాయ్‌ని ‘సాక్షి’ సంప్రదించగా– ‘‘అవును.. డైరెక్టర్‌గా నా ఫస్ట్ తెలుగు సినిమా కోసం కథ రెడీ చేశాను. రైతులకు సంబంధించిన సమస్యల మీద ఈ సినిమా ఉంటుంది. స్క్రీన్‌ప్లే వర్క్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇందులో నేను నటించను, కేవలం డైరెక్టర్‌ను మాత్రమే’’ అని అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఓ ప్రముఖ హీరో నటించనున్న చిత్రంలో రేణు ‘వదిన’ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. ‘‘ఇలాంటివి ఎవరు కల్పిస్తారో అర్థం కావడం లేదు. నేను ఏ తెలుగు సినిమాకీ ఓకే చెప్పలేదు’’ అని రేణు స్పష్టం చేశారు.
రైతులపై రేణూ సినిమా!
Published Thu, Jul 26 2018 12:16 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment