21 Years For Badri: Renu Desai Shares Pawan Kalyan Image At Badri Sets - Sakshi
Sakshi News home page

మెమరీస్‌ గుర్తుచేసుకున్న రేణు దేశాయ్‌‌

Published Tue, Apr 20 2021 1:25 PM | Last Updated on Tue, Apr 20 2021 3:20 PM

21 Years Of Badri : Renu Desai Recalls Memories Of Shooting With Pawan Kalyan - Sakshi

రేణు దేశాయ్‌, పవన్‌కల్యాణ్‌ జంటగా నటించిన చిత్రం బద్రీ. ఈ సినిమా వచ్చి నేటికి (మంగళవారం) 21 ఏళ్లు పూర్తవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన నిలిచిన ఈ మూవీలో డైలాగ్స్‌ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అమీషా పటేల్ మరో హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ డెబ్యూ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.

బద్రీ విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేణు దేశాయ్‌ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఏ చికితా'.. పాటకు సంబంధించిన ఫోటోను షేర్‌ చేసుకుంది. ఇందులో పవన్‌కల్యాణ్‌ తుపాకీ పట్టుకొని ఉండగా, రేణు దేశాయ్‌ తన ముఖాన్ని చున్నీతో కప్పుకుంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు దీన్నే సన్‌స్క్రీన్‌గా ఉపయోగించినట్లు ఫన్నీగా కామెంట్‌ చేసింది. 

ఇక ఈ సినిమాతో రేణు దేశాయ్‌ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. బద్రీ సినిమా షూటింగ్‌ సమయంలోనే పవన్‌, రేణుల మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం సహజీవనం అనంతరం ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నా ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత పవన్‌ అన్నా లెజ్నోవాని పెళ్లి చేసుకోగా, రేణు దేశాయ్‌ సైతం ఓ బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం అయినట్లు ప్రకటించింది. అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు రేణు దేశాయ్‌ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 

చదవండి : హీరోయిన్‌ అంజలా జవేరీ భర్త 'విలన్'‌ అని మీకు తెలుసా?
పెళ్లికి రెడీ అయిన కమెడియన్లు, ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement