Renu Desai Reply To Unknown Person Who Asked Her About Pawan Kalyan - Sakshi
Sakshi News home page

Pawan Kalyan: 'ఆడవాళ్లంటే గౌరవం అంటాడు.. మరి ఇప్పుడేమైంది పవన్‌ కల్యాణ్‌? వాళ్ల నోళ్లు మూయించరే'?

Published Tue, Apr 11 2023 10:05 AM | Last Updated on Tue, Apr 11 2023 11:04 AM

Renu Desai Reply To Unknown Person Who Asked Her About Pawan Kalyan - Sakshi

సినీ నటి రేణు దేశాయ్‌ పేరు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యగా పిలిపించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని రేణు దేశాయ్‌ తన కొడుకు అకీరాను మా అన్న(పవన్‌ కల్యాణ్‌)కొడుకు అని ఫ్యాన్స్‌ సంబోధించడంతో ఫైర్‌ అయ్యింది. 'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడే పద్ధతి నేర్చుకోండి' అని గట్టిగానే కౌంటరిచ్చింది.

11 ఏళ్లుగా ఈ సమాజం తనను చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కొందరు ఆమెపై ఇంకా విషం చిమ్ముతున్నారు. ఎలక్షన్స్‌ దగ్గర పడుతుండటంతో పవన్‌ మాజీ భార్య డ్రామాలు ఆడుతుందంటూ నీతి హీనంగా మాట్లాడుతుండగా, ''వి స్టాండ్‌ విత్‌ రేణు దేశాయ్‌'' అంటూ కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ పవన్‌ కల్యాణ్‌, అతని అభిమానులకు ఓ సూటి ప్రశ్న సంధించారు. చదవండి: 'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు'.. పవన్‌ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్‌ ఫైర్‌'

''పవన్‌ కల్యాణ్‌తో మీరు విడిపోయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయినా జనాలు ఇంకా చెత్త వాగుడు మాట్లాడుతున్నారు. అయినా ఇన్నేళ్లు వాళ్లందరి మాటలు భరిస్తూ, స్ట్రాంగ్‌గా ముందుకు వెళుతున్నా మళ్లీ మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు..పవన్‌ అభిమానులుగా చెప్పుకునే ఈ పిచ్చి ఫ్యాన్స్‌ మిమ్మల్ని ఇంత బాధపెడుతుంటే వాళ్ల నోళ్లు మూయించడానికి పవన్‌ కల్యాణ్‌ ఒక్క స్టేట్‌మెంట్‌ అయినా ఎందుకు ఇవ్వరు?

రాష్ట్ర ప్రజలందరి బాధలు పట్టించుకుంటా, ఆడవాళ్లంటే గౌరవం అని చెప్పుకొని తిరిగే పవన్‌ తన మాజీ భార్య విషయంలో ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు? ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇంత మానసిక సంఘర్షణకు గురవుతుంటేనే పట్టించుకోని పీకే(పవన్‌ కల్యాణ్‌) రాష్ట్ర ప్రజలందరి గురించి ఎలా చూసుకుంటాడు? మీకోసం ఒక్క స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆపడానికి ఆయనకు ఏం అడ్డు వస్తుందో అర్థం కావడం లేదు.

ఈ చెత్త, నాన్సెన్స్‌ నుంచి మీకు మానసిక ప్రశాంతత దక్కాలని కోరుకుంటున్నా'' అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. దీనికి రేణు దేశాయ్‌ స్పందిస్తూ.. మీలాగే ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలామంది అడుగుతారు. కానీ వాటికి నా దగ్గర సమాధానం లేదు. నా పరిధిలో లేని విషయాల గురించి నేనేం చెప్పను? అంటూ నిట్టూర్పుతో బదులిచ్చారు.

చదవండి: ఆమె మాటలు విని చాలా ఏడ్చాను: రేణు దేశాయ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement