renu
-
పక్కింటివాడని మాట్లాడటమే ఆమెకు శాపమైంది.. అసలేం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఇంటి ముందే నివాసం ఉంటున్న ఓ మహిళను యువకుడు కాల్చి చంపాడు. అనంతరం, యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, వీరిద్దరూ కొన్నేళ్ల క్రితం జిమ్‌లో కలుసుకున్నట్టు.. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలో మృతురాలు రేణు(40) కుటుంబంతో కలిసి నివసిస్తోంది. రేణుకు వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. ఇక, వీరి ఇంటి సమీపంలోనే ఆశిష్ కూడా ఉంటున్నాడు. కాగా, దాదాపు రెండేళ్ల క్రితం వీరిద్దరూ అక్కడున్న ఓ జిమ్‌లో కలుసుకున్నారు. దీంతో, వీరి మధ్య పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కాదు.. ఆశిష్ దారుణానికి ఒడిగట్టాడు. కాగా, గురువారం సాయంత్రం రేణు ఇంటికి వెళ్లిన ఆశిష్.. ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రేణును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక, అప్పటికే రేణు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా డీసీపీ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. దుబ్రీ పోలీసు స్టేషన్ పరిధిలో హత్య జరిగినట్టు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశాం. మృతిరాలిని రేణుగా, నిందితుడిని ఆశిష్‌గా గుర్తించామన్నారు. ఆశిష్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. అతడు అప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈ లోకానికి వీడ్కోలంటూ..అమ్మా, గురు మామా క్షమించండి -
'మాజీ భార్యనే పట్టించుకోని పవన్.. రాష్ట్ర ప్రజలను ఏం చూసుకుంటాడు'?
సినీ నటి రేణు దేశాయ్ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా పిలిపించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని రేణు దేశాయ్ తన కొడుకు అకీరాను మా అన్న(పవన్ కల్యాణ్)కొడుకు అని ఫ్యాన్స్ సంబోధించడంతో ఫైర్ అయ్యింది. 'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడే పద్ధతి నేర్చుకోండి' అని గట్టిగానే కౌంటరిచ్చింది. 11 ఏళ్లుగా ఈ సమాజం తనను చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు ఆమెపై ఇంకా విషం చిమ్ముతున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో పవన్ మాజీ భార్య డ్రామాలు ఆడుతుందంటూ నీతి హీనంగా మాట్లాడుతుండగా, ''వి స్టాండ్ విత్ రేణు దేశాయ్'' అంటూ కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ పవన్ కల్యాణ్, అతని అభిమానులకు ఓ సూటి ప్రశ్న సంధించారు. చదవండి: 'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు'.. పవన్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్' ''పవన్ కల్యాణ్‌తో మీరు విడిపోయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయినా జనాలు ఇంకా చెత్త వాగుడు మాట్లాడుతున్నారు. అయినా ఇన్నేళ్లు వాళ్లందరి మాటలు భరిస్తూ, స్ట్రాంగ్‌గా ముందుకు వెళుతున్నా మళ్లీ మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు..పవన్ అభిమానులుగా చెప్పుకునే ఈ పిచ్చి ఫ్యాన్స్ మిమ్మల్ని ఇంత బాధపెడుతుంటే వాళ్ల నోళ్లు మూయించడానికి పవన్ కల్యాణ్ ఒక్క స్టేట్మెంట్ అయినా ఎందుకు ఇవ్వరు? రాష్ట్ర ప్రజలందరి బాధలు పట్టించుకుంటా, ఆడవాళ్లంటే గౌరవం అని చెప్పుకొని తిరిగే పవన్ తన మాజీ భార్య విషయంలో ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు? ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇంత మానసిక సంఘర్షణకు గురవుతుంటేనే పట్టించుకోని పీకే(పవన్ కల్యాణ్) రాష్ట్ర ప్రజలందరి గురించి ఎలా చూసుకుంటాడు? మీకోసం ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆపడానికి ఆయనకు ఏం అడ్డు వస్తుందో అర్థం కావడం లేదు. ఈ చెత్త, నాన్సెన్స్ నుంచి మీకు మానసిక ప్రశాంతత దక్కాలని కోరుకుంటున్నా'' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ.. మీలాగే ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలామంది అడుగుతారు. కానీ వాటికి నా దగ్గర సమాధానం లేదు. నా పరిధిలో లేని విషయాల గురించి నేనేం చెప్పను? అంటూ నిట్టూర్పుతో బదులిచ్చారు. చదవండి: ఆమె మాటలు విని చాలా ఏడ్చాను: రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ -
రేణు ది గ్రేట్
భయంతో కూడిన మౌనం కంటే నిర్భయమైన నిరసన ఆయుధం అవుతుంది. రేణు పాసవాన్ విషయంలో ఇదే జరిగింది. చిన్న వయసులోనే తనకు పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. ‘నేను చదువుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకొని తండ్రి ఆగ్రహానికి గురైంది. బిడ్డ మనసును అర్థం చేసుకున్న ఆ తండ్రి ‘సరే నీ ఇష్టం’ అనక తప్పలేదు. ఆరోజు భయపడి బాల్యవివాహానికి సిద్ధమై ఉంటే రేణు పాసవాన్ స్పీకర్, లైఫ్‌కోచ్, రైటర్, ఇన్ఫ్లూయెన్సర్గా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేది కాదు. తాజాగా ఫాక్స్ స్టోరి ఇండియా ‘ఇండియాస్ 50 ఇన్స్పైరింగ్ వుమెన్ –2022’ జాబితాకు ఎంపికైంది రేణు... బిహార్‌లోని ముజాఫర్పూర్ జిల్లాలోని మిథాన్పుర అనే చిన్న గ్రామంలో పుట్టింది రేణు. ఆ ప్రాంతంలో బాల్యవివాహాలు సహజం. తనకు కూడా పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తే ఇంటి నుంచి పారిపోయింది. ఎక్కడో ఉన్న రేణును ఇంటికి తీసుకువచ్చిన తండ్రి ‘పెళ్లి అంటూ నిన్ను బాధ పెట్టను’ అన్నాడు. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది రేణు. బయెటెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. పుణెలో ఎంబీఏ చేసింది. బెంగళూరులో బయోటెక్నాలజీ చదువుకునే రోజుల్లో హస్టల్లో అమ్మాయిలు రేణుకు దూరంగా ఉండేవారు. నిరక్ష్యం చేసేవారు. దీనికి కారణం తాను బిహారి కావడం! ఇక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు బిహారీల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు అమానుషంగా ఉండేది. ఇవన్నీ చూసిన తరువాత తనకు బాధగా అనిపించేది. ‘ఇన్పోసిస్’లో కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసింది రేణు. తాను నడిచొచ్చిన దారిపై ఒకసారి పుణె క్యాంపస్‌లో ప్రసంగించింది. ఇది ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘మీ జీవితానుభవాలకు ఎందుకు అక్షర రూపం ఇవ్వకూడదు! చాలా మందికి స్ఫూర్తి ఇస్తాయి’ అని చెప్పడంతో ‘లివ్ టూ ఇన్స్పైర్’ పేరుతో తొలి పుస్తకం రాసింది రేణు. బిహార్‌లోని మారుమూల గ్రామం నుంచి బెంగళూరులో ఉద్యోగం వరకు తన ప్రయాణానికి అక్షరరూపం ఇచ్చింది. ఈ పుస్తకం బాగా పాపులర్ అయింది. ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముడుతుండగా ‘నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది’ అనుకుంది రేణు. ‘లివ్ టూ ఇన్స్పైర్’ అనే సంస్థను స్థాపించి గ్రామాలలోని మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడానికి అవసరమైన సహకారం అందిస్తోంది. కళాకృతుల తయారీలో మహిళలకు శిక్షణ ఇప్పిస్తోంది. దీంతో పాటు మహిళల హక్కుల కోసం పనిచేయడం మొదలుపెట్టింది. అలా ‘జి–100’ గ్రూప్‌లో చేరింది. బిహార్ నుంచి ఈ గ్రూప్‌లో చేరిన తొలి మహిళ రేణు. జి–100 అనేది ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం గొంతు విప్పుతున్న మహిళా ఉద్యమకారుల పోరాట వేదిక. జి–100 గ్రూప్ ఛైర్మన్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రేణు పాసవాన్ లివ్ టూ ఇన్స్పైర్ తరువాత ది న్యూ, సస్టేనబుల్ డెవలప్మెంట్ అనే రెండు పుస్తకాలు రాసింది. ఇవి తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి. ఐక్యరాజ్యసమితి ‘జెండర్ ఈక్వాలిటీ’కి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే రేణు ‘షి ది చేంజ్’ టైటిల్‌కు ఎంపికైంది. ‘ఆ ఇంట్లో వ్యక్తులు కాదు సమస్యలు ఉంటాయి’ అని ఊరివాళ్లు అనుకునేవారు. ఎందుకంటే రేణు సోదరులు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవాళ్లు. తల్లికి మానసిక సమస్యలు. వంట వండడం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నీ తన బాధ్యతలే అయ్యేవి. ఇలాంటి ఇంట్లో నుంచి వచ్చిన రేణు పాసవాన్ మోటివేషనల్ స్పీకర్‌గా, స్త్రీ హక్కుల ఉద్యమకార్యకర్తగా ప్రపంచవ్యాప్తగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం పైకి ఎదిగినా పరాయికరణకు లోను కాకపోవడం. తన మూలాలు ఏమిటో మరవకపోవడం. -
ప్రియుడి ఆత్మహత్య: సింగర్ పరిస్థితి విషమం
-
ప్రియుడి ఆత్మహత్య: సింగర్ పరిస్థితి విషమం
జైపూర్ : ఇండియన్ ఐడల్ ఫేమ్, గాయని రేణు నగర్(26) ఆస్పత్రి పాలయ్యారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలియడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో అల్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా దేశంలో మంచి సింగర్‌గా రేణుకు పేరుంది. ఇండియన్ ఐడల్ సీజన్10తోపాటు సరిగమపలో పాల్గొన్నారు. కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ కనిపించారు. అయితే రవిశంకర్ అనే వివాహితుడితో రేణు నగర్ కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. (బాలీవుడ్ సింగర్ తల్లి మృతి) ఈ జంట జూన్‌లో ఇంటి నుంచి కూడా పారిపోయారు. కూతురు గురించి తెలిసి రేణునగర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆగష్టు 24న వీరి జాడ తెలుసుకున్న పోలీసులు ప్రేమికులను తిరిగి రప్పించారు. ఈ క్రమంలో బుధవారం విషంతాగి రవి శంకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. దురదృష్టవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో రేణు నగర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో చిక్సిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రవిశంకర్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. రవికి ఇంతక ముందు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణు ఇంట్లో సంగీత విద్య నేర్చుకోవడానికి వచ్చి ఆమెతో ప్రేమలో పడినట్లు సమాచారం. -
ఈ పెళ్లి ఆహ్వాన వీడియో చూస్తే..
ముంబై: అంగరంగ వైభోగం.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట.. బహుశా ఈ మాటలు కూడా చిన్నబోయేంత వైభవంగా జరిగిన ఓ బీజేపీ నేత కుమారుని వివాహ వేడుక ఇపుడు హాట్టాపిగ్గా నిలిచింది. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు రావ్‌సాహెబ్ పాటిల్ దన్వే కుమారుడు, భోకార్దన్ ఎంఎల్ఏ సంతోష్ పాటిల్ వివాహం గురువారం అత్యంగా వైభవంగా జరిగింది. అయితే ఏంటి అనుకుంటున్నారా...అయితే దీని ప్రత్యేకత ఏంటో చెప్పాల్సిందే....వీడియో ఆహ్వానాలు, డిజైనర్ సెట్లు, డ్రోన్ కెమెరాలతో , పోలీసు నిఘాలో నిర్వహించిన పెళ్లితో రావ్ సాహెబ్ అందరి దృష్టిని ఆకర్షించగా.. మరోవైపు ఈ పెళ్లి ఆహ్వానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను నూతన వరుడు సంతోష్ శుక్రవారం తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. సినిమా స్టయిల్ ను మించి రూపొందించిన ఈ వీడియో వైరల్ అయింది. పెళ్లి కూతురితో కలిసి పెళ్లికొడుకు సైకిల్ తొక్కుతూ, పార్క్‌లో డ్యాన్స్ వేస్తూ ఉన్న ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. సుమారు 45 వేలకు పైగా లైక్స్‌ను, వందల షేర్లను సాధించింది. దాదాపు 30,000 మంది అతిథులు హాజరైన ఈ పెళ్లి వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా మొత్తం క్యాబినెట్ విచ్చేయడం మరో విశేషంగా నిలిచింది. సంతోష్ 2014 ఎన్నికల్లో భోకార్దన్ నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా కరువు కాటకాలతో అల్లాడుతున్న ఈ నియోజకవర్గంలో భారీ ఖర్చుతో, అత్యంత వైభవంగా పెళ్లి వేడుకలు నిర్వహించడం వార్తల్లో నిలిచింది. -
మాజీ భార్యతో పవర్ స్టార్ పవన్!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాజీ భార్య రేణూ దేశాయ్, పిల్లలతో కలిసి వున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా పవన్ కల్యాణ్ బయట ఫంక్షన్లలోనూ, రెస్టారెంట్లలోనూ కనిపించడం చాలా అరుదు . అలాంటిది కొడుకు అకిరా, కూతురు ఆద్య సహా రేణూ దేశాయ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను అభిమానులు షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తున్న ఫోటో ఇప్పడు హల్ చల్ చేస్తోంది. రెస్టారెంట్ కి వచ్చిన సందర్భంగా ఓ కస్టమర్ ఈ ఫోటోను తీసినట్టుగా తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పిల్లలతో సమయం గడిపేందుకు పవన్ ఇలా తీరిక చేసుకున్నట్టు సమాచారం. -
యాసిడ్ దాడి.. ఆ పై ఆత్మహత్య
భోపాల్: యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధించినా, మహిళల మీద యాసిడ్ దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా భోపాల్‌లో మరో యాసిడ్ దాడి జరిగింది. బాధితురాలు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చాలాకాలంగా వెంటపడుతూ, వేధిస్తున్న 40 ఏళ్ల సంజయ్ పాటిల్ చివరకు ఆ అమ్మాయిపై యాసిడ్ దాడి చేసి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్పీ అరవింద్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం 22 ఏళ్ల రేణు స్థానికంగా జిమ్ ట్రైనర్ పని చేస్తోంది. ఉదయాన్నే స్కూటీపై వెళ్తుండగా కొద్ది దూరం ఆమె వాహనాన్ని ఫాలో అయ్యాడు. సడన్‌గా ఆమెను అడ్డగించి యాసిడ్ దాడి చేశాడు. ఆ తర్వాత తనను తాను కత్తితో పొడుచుకుని, అక్కడిక్కడే చనిపోయాడు. రేణు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా పొద్దున్నే జిమ్‌కు వెళ్తుండగా అతను తన మీద దాడి చేసి యాసిడ్ పోశాడని బాధితురాలు వాపోతోంది. అతను చాలాకాలంగా తనను వేధిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తోంది. అతడు కొన్ని రోజులుగా తమ కూతుర్ని వేధిస్తున్నాడని, ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేశాడని రేణు తల్లి మమతా సాహు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ పాటిల్ పై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.