మాజీ భార్యతో పవర్ స్టార్ పవన్!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాజీ భార్య రేణూ దేశాయ్, పిల్లలతో కలిసి వున్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా పవన్ కల్యాణ్ బయట ఫంక్షన్లలోనూ, రెస్టారెంట్లలోనూ కనిపించడం చాలా అరుదు . అలాంటిది కొడుకు అకిరా, కూతురు ఆద్య సహా రేణూ దేశాయ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను అభిమానులు షేర్ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తున్న ఫోటో ఇప్పడు హల్ చల్ చేస్తోంది. రెస్టారెంట్ కి వచ్చిన సందర్భంగా ఓ కస్టమర్ ఈ ఫోటోను తీసినట్టుగా తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పిల్లలతో సమయం గడిపేందుకు పవన్ ఇలా తీరిక చేసుకున్నట్టు సమాచారం.