పవన్ కళ్లల్లోని తీవ్రత ఇష్టం- రేణు దేశాయ్ | 'I love the intensity of his eyes' tweets Renu desai | Sakshi

పవన్ కళ్లల్లోని తీవ్రత ఇష్టం- రేణు దేశాయ్

Published Mon, Aug 29 2016 5:04 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ కళ్లల్లోని తీవ్రత ఇష్టం- రేణు దేశాయ్ - Sakshi

పవన్ కళ్లల్లోని తీవ్రత ఇష్టం- రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. స్వయంగా తను క్లిక్మనిపించిన పవన్ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు జోడించారు. తాను తీసిన పవన్ ఫొటోను పోస్ట్ చేసి.. 'అతని కళ్లల్లోని తీవ్రత అంటే నాకిష్టం. ఈ ఫొటో నా ఫేవరెట్. ఫొటోలో కనిపిస్తున్న స్కిన్ టోన్ కూడా ఒరిజినల్, నేను ఎడిట్ చేయలేదు. ఈ ఫొటో 2010లో నేనే క్లిక్ చేశాను. 5డి కెమెరా కొనుక్కున్నాను. పవన్ ఓ రోజు మౌనంగా కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుండగా ఫొటో తీశాను' .. అంటూ అప్పటి విషయాలను వివరించారు.

కల్యాణ్ గారి పుట్టినరోజున ఈ ఫొటోని కామన్ డీపీగా వాడుకోవచ్చంటూ తెలిపారు. అలాగే ఆమె తీసిన ఫొటోలను గత ఏడాది కూడా ట్విట్టర్ ద్వారా అభిమానులకు షేర్ చేసిన రేణు, ఈ ఏడాది కూడా ఈ స్పెషల్ ఫొటోను పోస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement