వెనక్కి వెళ్లమంటున్నారు...ఎక్కడికి?: రేణు దేశాయ్ | renu desai special interview | Sakshi
Sakshi News home page

వెనక్కి వెళ్లమంటున్నారు...ఎక్కడికి?: రేణు దేశాయ్

Published Thu, Dec 4 2014 7:25 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

వెనక్కి వెళ్లమంటున్నారు...ఎక్కడికి?: రేణు దేశాయ్ - Sakshi

వెనక్కి వెళ్లమంటున్నారు...ఎక్కడికి?: రేణు దేశాయ్

హీరో పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత తొలిసారిగా రేణు దేశాయ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ నుంచి దూరంగా ఉన్న రేణు దేశాయ్ ఈ సందర్భంగా తన ఇద్దరు పిల్లలు అకీరా..ఆద్యా గురించి కబుర్లు చెబుతూ మురిసిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ను షేర్ చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ను చూసిన తొలి చూపులోనే ఆయనతో ప్రేమలో పడిపోయానని రేణుదేశాయ్ తెలిపారు. అయితే ప్రపోజ్ చేసింది మాత్రం పవన్ అనే అన్నారు. 18 ఏళ్ల వయసులో 'బద్రి' సినిమా చేయడానికి హైదరాబాద్ వచ్చానని చెప్పారు. తనకు 19 సంవత్సరాలు ఉన్నపుడు పెళ్లి చేసుకున్నామని అయితే అధికారికంగా కాదని...ఇంట్లో చేసుకున్నట్లు చెప్పారు.

ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని రేణు దేశాయ్ తెలిపారు. తమ మధ్య పెద్దగా గొడవలు ఏమీ లేవని, అయితే తాము ఇద్దరం చాలా ప్రశాంతంగా విడిపోయామని చెప్పారు. భార్యా భర్తల మధ్య ఎవరూ మాట్లాడకూడదను అని పెద్దలు అంటు ఉంటారని..11ఏళ్లు కలిసి ఉన్నా.. తాము ఎందుకు విడిపోయామనే విషయం తనకు పవన్ కళ్యాణ్కు మాత్రమే తెలుసునన్నారు. అయితే అందరూ ఇదే విషయాన్ని అడుగుతారని రేణు దేశాయ్  ఎందుకు విడిపోయారనే విషయాన్ని దాటవేశారు.

తాను పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయేందుకు 40 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగిందని. అయితే తాను  ఎలాంటి డబ్బు తీసుకోలేదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. తాము విడిపోయిన నాలుగు నెలల  తర్వాత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఇదే విషయాన్ని అడిగారని ఆమె తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించేదాన్ని అని... అలాంటిది పవన్ నుంచి డబ్బు తీసుకున్నాననే వార్తలపై సంవత్సరం పాటు బాధపడినట్లు చెప్పారు. దీనిపై చాలా వార్తలు, కథనాలు రాశాయని అయితే తాను ఏంటనేది తన కుటుంబ సభ్యులకు తెలుసు అన్నారు.

వెనక్కి వెళ్లిపోవచ్చు కదా అని చాలామంది అభిమానులు అంటున్నారని... అయితే తాను బలవంతంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లలేనని, అతని ప్రైవసీని దెబ్బతీయలేనని చెప్పారు. తిరిగి వెళ్లిపోవచ్చు కదా అని సలహాలు ఇచ్చేవాళ్లు ...ఎవరి దగ్గరకు వెళ్లాలనేది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని రేణుదేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టంలో అయినా, సుఖంలో అయినా స్థితప్రజ్ఞతో ఉండాలని భగవద్గీతలో ఉందని ఆమె అన్నారు. నేను  ఎవరు అనేది ప్రస్తుతం తానే వెతుక్కుంటున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement