వ్యక్తిగత విషయాలు చెబుతా: రేణు దేశాయ్ | Renu Desai to Pour her heart out | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత విషయాలు చెబుతా: రేణు దేశాయ్

Published Wed, Dec 3 2014 9:10 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

వ్యక్తిగత విషయాలు చెబుతా: రేణు దేశాయ్ - Sakshi

వ్యక్తిగత విషయాలు చెబుతా: రేణు దేశాయ్

హీరో పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత తొలిసారిగా వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి రేణు దేశాయ్ రెడీ అయ్యారు. తన పుట్టినరోజున ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడనున్నట్టు వెల్లడించారు. మొదటిసారి తన గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించనున్నట్టు ట్విటర్ లో పేర్కొన్నారు. డిసెంబర్ 4న తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నుట్టు తెలిపారు. తన ఇంటర్వ్యూ కోసం గురువారం యూట్యూబ్ లో చూడాలని సూచించారు.

తాము విడిపోవడానికి కారణాలను పవన్ కళ్యాణ్ గానీ, రేణు దేశాయ్ గానీ ఇప్పటివరకు వెల్లడించలేదు. అది వ్యక్తిగత విషయమంటూ చెబుతూవచ్చారు. పవన్ మూడో వివాహం కూడా చాలా రోజుల తర్వాత వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ ప్రత్యేక ఇంటర్య్వూపై ఆసక్తి నెలకొంది. ఆమె ఏం చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

renu desai tweet:
Giving a very special& personal interview for my Bday...speaking abt myself 1st time...so see u on 4th Dec on utube:)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement