
రేణూ దేశాయ్ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కాబోయే భర్త వివరాలు ఆమె బయటపెట్టలేదు. ఇప్పుడు ట్వీటర్‌లో తన అకౌంట్‌ని కూడా డిలిట్ చేసుకున్నారామె. అకౌంట్ డిలిట్ చేసుకోడానికి గల కారణాన్ని వివరిస్తూ – ‘‘ట్వీటర్ నిండా విపరీతమైన నెగిటివిటీ నిండి ఉందని నాకు అనిపిస్తోంది. ఇక్కడ (ట్వీటర్ ఫాలోయర్స్) ఉన్నవాళ్లు ఎక్కువగా అజ్ఞాత వ్యక్తులు. వ్యక్తిగతంగా, వృతిరీత్యా చిరాకుతో ఉన్నవాళ్లు సినిమా గురించి, రాజకీయ వ్యక్తుల గురించి నెగిటీవ్‌గా రాయడానికి ఇష్టపడతారు.
కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకున్న ఈ సమయంలో ట్వీటర్ నుంచి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. ప్రతికూల పరిస్థితిలో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. రేణూ దేశాయ్ ఎంగేజ్‌మెంట్ గురించి పవన్ కల్యాణ్ స్పందిస్తూ – ‘‘కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తోన్న రేణుగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె సంతోషంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment