నామీద పడి ఏడవకండి: రేణు దేశాయ్ | pawan kalyan is very proud of me, says Renu desai on twitter | Sakshi
Sakshi News home page

నామీద పడి ఏడవకండి: రేణు దేశాయ్

Published Mon, Sep 15 2014 11:34 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నామీద పడి ఏడవకండి: రేణు దేశాయ్ - Sakshi

నామీద పడి ఏడవకండి: రేణు దేశాయ్

రేణు దేశాయ్... పరిచయం అక్కర్లేని పేరు. హీరో పవన్ కళ్యాణ్తో విడిపోయినా ...అతని పేరు ఉపయోగించుకోవటంపై వస్తున్న మెసేజ్లపై ఆమె తన ట్విట్టర్లో ఘాటుగా స్పందించింది. అకిరా ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించిన రేణు దేశాయ్ నిర్మాతగా మారి మరాఠీలో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా రేణు దేశాయ్ నిర్మించిన 'మంగలాష్ తక్ వన్స్ మోర్'  సినిమా విజయం సాధించింది. ట్విట్టర్లో రెగ్యులర్గా టచ్లో ఉంటున్న రేణు దేశాయ్....పవన్ పేరును వాడుకుని ఫేమస్ అవటానికి ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యలను  ఖండించింది.

పవన్ కళ్యాణ్ను పెళ్లాడక ముందు తాను ఫేమస్  మోడల్, నటి అనే విషయాన్ని రేణు దేశాయ్ గుర్తు చేసింది. 'పవన్ గారు ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ' అన్న ఆమె గత ఏడాది ఏ ఒక్కరి సాయం, మద్దతు లేకుండా ఓ హిట్ సినిమా తీశానని తెలిపింది. ఇకనైనా ఈ విషయంలో అతిగా ఆలోచించే బుర్రలు ఇకనైనా ఆపాలని సూచించింది. ఆ ఎనర్జీని ఏదైనా సోషల్ వర్క్కు ఉపయోగిస్తే మంచిదని రేణు సలహా కూడా ఇచ్చింది.

గతంలో కూడా రేణుదేశాయ్కి పవన్ అభిమానులు ఆమెను అవమానించే విధంగా మెసేజ్లు పోస్ట్ చేశారు. ఆ మెసేజ్లపై స్పందించిన ఆమె తన ఫేస్బుక్ ద్వారా సమాధానం ఇచ్చింది. 'ఇలాంటి మెసేజ్లు పంపించడం సరికాదు. ఇది పవన్కి కూడా నచ్చదు. నేను ఈ రోజు నుంచి నా ఇన్ బ్యాక్స్ ఆప్షన్ని స్విచ్ఛాప్ చేస్తున్నాను. సెలబ్రెటీస్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారిని ఈ విధంగా వేధించడం తగదు. పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ, మిగతా వారి ఇబ్బందులను కూడా ఆలోచించాలి' అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement