బాబాయ్-అబ్బాయ్ ఫొటో అదిరింది | Pawan-Charan pic creating tremors | Sakshi
Sakshi News home page

బాబాయ్-అబ్బాయ్ ఫొటో అదిరింది

Published Sat, Sep 3 2016 7:24 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

బాబాయ్-అబ్బాయ్ ఫొటో అదిరింది - Sakshi

బాబాయ్-అబ్బాయ్ ఫొటో అదిరింది

పవర్స్టార్ పవన్ కల్యాణ్కు, మెగా ఫ్యామిలీకి మధ్య దూరాలు ఉన్నట్లు ప్రచారం జరిగినా అవన్నీ ఒట్టి పుకార్లే అని పలుమార్లు తేలింది. ఇటీవల పవన్ చిన్న కూతురు పొలెన్.. చరణ్తో రాఖీ పండుగ చేసుకోవడం, ఆ తరువాత పవన్ సతీమణి అన్నా లెజ్నోవా.. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వడంలాంటివి చూస్తుంటే ఇరు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అర్థమవుతోంది.

తాజాగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఫ్యాన్స్ని అమితంగా ఆకట్టుకుంటోంది. 'సర్దార్ గబ్బర్సింగ్' సెట్లో తీసిన ఈ ఫొటో బాబాయి, అబ్బాయిల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూపెడుతోంది. దాంతో పవన్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ ఫొటోను షేర్ చేస్తూ మురిసిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement