![Bheemla Nayak Pawan Kalyan Rana Latest Still Fans enjoying - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/21/pawan.jpg.webp?itok=_riqIRX8)
సాక్షి, హైదరాబాద్: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భీమ్లా నాయక్’ కు సంబంధించి ఒక ఫోటో వైరలవుతోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ తరువాత పవన్, రానా ఫోటోను ‘అన్‌వైండింగ్ ఆఫ్ ది కెమెరా’ అంటూ చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కోసం విడుదల చేసింది. ఛాతీ మీద గాయంతో నులకమంచం మీద పవన్ పడుకుని ఉంటే.. రఫ్ లుక్‌లో రానా ఎడ్లబండి మీద వయ్యారంగా పడుకున్న స్టిల్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. పవర్ వెర్సెస్ బీస్ట్ అని కమెంట్ చేస్తున్నారు.
అలసిపోయి, షూటింగ్ దుస్తుల్లోనే అలా సేద తీరుతున్న దృశ్యాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగా ఈ ఫోటోను క్లిక్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న 'భీమ్లా నాయక్' సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దు కుంటోంది. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
కాగా ఈ సినిమా టైటిల్ సాంగ్,టీజర్‌కు భారీ క్రేజ్ రాగా, ఇక నిత్యమీనన్ 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. పవన్ జోడీగా నిత్యా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు.
Unwinding off the camera #BheemlaNayak & #DanielShekar ♥️💥@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/JfPeOq21ai
— Sithara Entertainments (@SitharaEnts) October 21, 2021
Comments
Please login to add a commentAdd a comment