
జైపూర్ : ఇండియన్ ఐడల్ ఫేమ్, గాయని రేణు నగర్(26) ఆస్పత్రి పాలయ్యారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలియడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో అల్వార్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా దేశంలో మంచి సింగర్‌గా రేణుకు పేరుంది. ఇండియన్ ఐడల్ సీజన్10తోపాటు సరిగమపలో పాల్గొన్నారు. కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ కనిపించారు. అయితే రవిశంకర్ అనే వివాహితుడితో రేణు నగర్ కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. (బాలీవుడ్ సింగర్ తల్లి మృతి)
ఈ జంట జూన్‌లో ఇంటి నుంచి కూడా పారిపోయారు. కూతురు గురించి తెలిసి రేణునగర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆగష్టు 24న వీరి జాడ తెలుసుకున్న పోలీసులు ప్రేమికులను తిరిగి రప్పించారు. ఈ క్రమంలో బుధవారం విషంతాగి రవి శంకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. దురదృష్టవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో రేణు నగర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో చిక్సిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రవిశంకర్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. రవికి ఇంతక ముందు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణు ఇంట్లో సంగీత విద్య నేర్చుకోవడానికి వచ్చి ఆమెతో ప్రేమలో పడినట్లు సమాచారం.