Renu Desai And Son Akira Nandan Test Covid19 Positive: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ సినీ పరిశ్రమలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, త్రిష సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, దర్శకురాలు రేణుదేశాయ్, కొడుకు అకీరా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
'అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేను ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా నాకు కరోనా సోకింది. అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్ వేవ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి' అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment