Akhira nandan
-
'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు'.. పవన్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్'
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 'బద్రి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె దర్శకురాలిగా అలరిస్తున్నారు. 2012లో పవన్‌కల్యాణ్-రేణు దేశాయ్ విడాకులు తీసుకోగా, అప్పట్నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ తాజాగా పవన్‌కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏమైందంటే.. నిన్న(ఏప్రిల్8)న కొడుకు అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలు సహా పలువురు అభిమానులు అకీరాకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం హద్దు దాటి ప్రవర్తించడంతో రేణు దేశాయ్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. "మేడమ్. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్న(పవన్ కల్యాణ్)కొడుకును చూడాలని మాకు ఉంటుంది. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడు అయినా వీడియోస్‌లలో అకీరా బాబును చూపించండి'' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రేణు దేశాయ్ బదులిస్తూ..'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు.మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. చాలావరకు ఇలాంటి కామెంట్స్‌ను డిలీట్ చేస్తూ వస్తున్నాను. కానీ కొందరు హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు బర్త్‌డే రోజున ఇలాంటి కామెంట్స్ చదవడం బాధేస్తోంది. 11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిలా, విలన్‌గా చూస్తున్నారు. ఇదంతా చూసిచూసి నేను విసిగిపోయాను' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రేణు దేశాయ్ పోస్ట్‌కి అర్ధం ఏంటి? రెండో పెళ్లికి రెడీనా..?
-
పవన్ కల్యాణ్ కొడుకు అకీరాకి కరోనా పాజిటివ్
Renu Desai And Son Akira Nandan Test Covid19 Positive: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ సినీ పరిశ్రమలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, త్రిష సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, దర్శకురాలు రేణుదేశాయ్, కొడుకు అకీరా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 'అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేను ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా నాకు కరోనా సోకింది. అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్ వేవ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి' అంటూ రేణు దేశాయ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by renu (@renuudesai) -
పిల్లలతో పవన్ జాలీ ట్రిప్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్.. పాటల చిత్రీకరణ కోసం బల్గేరియా వెళ్లింది. అయితే ఎప్పుడు తన సినిమా షూటింగ్ లకు ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకెళ్లడానికి ఇష్టపడని పవన్ ఈ సారి మాత్రం తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకొని బల్గేరియా వెళ్లాడు. రేణుదేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యాలతో పాటు అన్నాలెజినోవా కూతురు పోలెనాలను తనతో పాటు బల్గేరియా తీసుకెళ్లాడు. బల్గేరియా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సమయంలో ఎయిర్ పోర్ట్ లో మీడియా కెమెరా కంట పడ్డాడు. పవన్ తో అకీరా, ఆద్యా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో పవన్ తో పాటు ఆయన భార్య అన్నా లెజినోవా కూడా ఉన్నారు. వరుసగా సినిమాలకు కమిట్ అవుతుండటంతో పాటు త్వరలో రాజకీయాల్లోనూ బిజీ అవుతాడని భావిస్తున్న పవర్ స్టార్, పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకే వెంట తీసుకెళ్లాడని భావిస్తున్నారు. ఈ ఫోటోలలో లిటిల్ పవర్ స్టార్ అకీరా నందన్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 14 ఏళ్ల అకీరాలో ఇప్పుడే హీరో ఫీచర్స్ కనిస్తుండటంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఖాయం అని భావిస్తున్నారు. పవన్ కన్నా ఎత్తు పెరిగిన అకీరా, ఇప్పటికే రేణు దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.