అయోధ్యలో ఆది పురుష్‌ టీజర్‌, ఫస్ట్‌ పోస్టర్‌ | Adipurush First Poster and Teaser Releasing On October 2nd At Ayodhya | Sakshi
Sakshi News home page

Adipurush: అయోధ్యలో ఆది పురుష్‌ టీజర్‌, ఫస్ట్‌ పోస్టర్‌

Published Fri, Sep 30 2022 7:52 AM | Last Updated on Fri, Sep 30 2022 7:56 AM

Adipurush First Poster and Teaser Releasing On October 2nd At Ayodhya - Sakshi

బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌-‘డార్లింగ్‌’ ప్రభాస్‌ కాంబినేషన్‌లో అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ఆది పురుష్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణ ఇతిహసం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. అయితే అక్టోబర్‌ 2న ఆది పురుష్‌ టీజర్‌, ఫస్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయోధ్యలో రిలీజ్‌ చేయబుతున్నట్ల ఇప్పటికే చిత్ర ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. అయోధ్యలోని సరయూ రివర్‌ బ్యాంక్‌, ఉత్తరప్రదేశ్‌ వేదికగా అక్టోబర్‌ 2న సాయంత్రం 7:11 గంటలకు ఆది పురుష్‌ టిజర్‌,, ఫస్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తున్నామంటూ వెన్యూ, టైంను ప్రకటించింది మూవీ యూనిట్‌. ఈ సందర్భంగా ప్రభాస్‌ సంబంధించిన పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఇందులో ప్రభాస్‌ బాణం పైకి ఎత్తి చూపుతూ కనిపించాడు. కాగా ఈ సినిమాలో కృతిసనన్‌ సీతగా నటిస్తుండగా.. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement