
యోగిబాబు
హాస్యనటుడు యోగిబాబు టైటిల్ రోల్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. శామ్ ఆంటోని దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను హీరో శివ కార్తీకేయన్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘గుర్కా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యోగిబాబు లీడ్ రోల్ చేస్తున్న తొలి చిత్రం ఇది.
ఇందులో కుక్క కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తుందని చిత్రబృందం చెబుతోంది.ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘యోగిబాబు లీడ్ రోల్‌లో నటిస్తున్న గుర్కా ఫస్ట్ లుక్, టైటిల్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు శివకార్తీకేయన్. ‘‘నా నెక్ట్స్ సినిమా ‘గుర్కా’ అని అనౌన్స్ చేయడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు యోగిబాబు.
Comments
Please login to add a commentAdd a comment