
యోగిబాబు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్...ఇలా ఏ ఇండస్ట్రీ అయినా టాప్ కమెడియన్స్ హీరోలుగా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రాక్‌లోకి రావడానికి తమిళ హాస్యనటుడు యోగిబాబు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన హీరోగా సామ్ అంటోన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ‘‘యోగిబాబును దృష్టిలో ఉంచుకుని ఓ కథను రెడీ చేశా. ఆ స్క్రిప్ట్‌ను ఆయనకు వినిపించాను.
హీరోగా నటించడానికి ఒప్పుకున్నారు.ఇందులో ఆయన సెక్యూరిటీ గార్డ్ పాత్ర చేస్తారు. ఓ కుక్క కూడా ఓ కీలక పాత్ర చేస్తుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని సామ్ అంటోని పేర్కొన్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాను తమిళంలో ‘డార్లింగ్’ పేరుతో రీమేక్ చేశారు ఆంటోని. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’ సినిమా యోగిబాబు కెరీర్‌లో 100వ చిత్రం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment