టైటిల్ : సుబ్రహ్మణ్యపురం
జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు: సుమంత్, ఈషా రెబ్బా, సురేష్, భద్రం, జోష్ రవి తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: భీరం సుధాకర్ రెడ్డి
దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి
‘మళ్లీరావా’ లాంటి కూల్ హిట్‌తో పలకరించిన సుమంత్.. తన పంథాను మార్చుకుని డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కించిన సినిమాలతో ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయ్యాడు. సుమంత్ కొత్తగా ట్రై చేస్తూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్యపురం’తో ఈ శుక్రవారం(డిసెంబర్ 7) ఆడియెన్స్‌ను పలకరించాడు. మరి ఈ సినిమాతో సుమంత్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? కొత్తగా ట్రై చేసిన ఈ మూవీ సుమంత్‌కు కలిసివచ్చిందా? ఓ సారి కథలోకి వెళ్దాం..
కథ :
సుబ్రహ్మణ్యపురం గ్రామంలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి ఒక విశిష్టత ఉంటుంది. అక్కడి గుడిలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి అభిషేకం జరగదు. అయితే అనుకోకుండా ఓ వ్యక్తి విగ్రహానికి అభిషేకం చేస్తాడు. తరువాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక అప్పటినుంచి వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి.(సాక్షి రివ్యూస్) అయితే ఇదంతా దైవమహిమ అనుకుంటూ ఊళ్లో వాళ్లు భయపడుతుంటారు. అయితే ఈ ఆత్మహత్యలకు గల కారణాలేంటి? అసలు ఆ విగ్రహానికి అభిషేకం ఎందుకు నిర్వహించరు? వీటన్నంటిని కనిపెట్టడానికి సుమంత్ చేసిన ప్రయత్నాలేంటి? అనేదే మిగతా కథ.
నటీనటులు :
కార్తీక్ (సుమంత్).. పురాతన దేవాలయాలపై పరిశోదన చేస్తూ ఉంటాడు. కార్తీక్‌కు దేవుడు అంటే నమ్మకం ఉండదు. ప్రతిదానికి కారణాలు వెతుకుతుంటాడు. హేతువాది పాత్రలో సుమంత్ బాగా చేశాడు. సత్యం, మళ్లీరావా లాంటి సినిమాల్లో కూల్ పర్ఫామెన్స్ ఇచ్చిన సుమంత్ ఈ చిత్రంలో తన నటనలోని మరో కోణాన్ని చూపించారు.(సాక్షి రివ్యూస్) ఇక ప్రియా పాత్రలో నటించిన ఈషా రెబ్బ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. సుమంత్ స్నేహితులుగా నటించిన భద్రం, జోష్ రవి ఫర్వాలేదనిపించారు. సాయి కుమార్, ఎస్సై పాత్రలో అమిత్ శర్మ, గిరి, గ్రామ పెద్దగా నరేంద్ర వర్మ క్యారెక్టర్‌లో సురేష్ తమ పరిధిమేరకు మెప్పించారు.
విశ్లేషణ :
దేవుడు-మనిషి ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ సక్సెస్ ఫార్మూలానే. నమ్మకాలు-నిజాలు, వాస్తవాలు-ఊహలకు మధ్య అల్లే కథ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ అల్లే కథాకథనాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. (సాక్షి రివ్యూస్)ఇదివరకు ఇలాంటి నేపథ్యంలో సినిమాలు వచ్చినా.. సుబ్రహ్మణ్యపురం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. అయితే వీటిని తెరకెక్కించేప్పుడు గత చిత్రాల ప్రభావం పడకుండా చూసుకుంటే ఇంకా బాగుండేది. ఇలాంటి కథలో వేగం ముఖ్యం. అదే ఈ చిత్రంలో కాస్త కొరవడినట్టు కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ లోపాలు అక్కడక్కడా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సుమంత్
కథ
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్
నిడివి
బండ కళ్యాణ్, ఇంటర్‌నెట్ డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment