‘ఇదం జగత్’ ట్రైలర్ ఆవిష్కరణ | Sumanth Idam Jagath Official Trailer Launch | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 20 2018 2:31 PM | Last Updated on Thu, Dec 20 2018 2:31 PM

Sumanth Idam Jagath Official Trailer Launch - Sakshi

సుమంత్ నటిస్తోన్న వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అంజు కురియన్ కథానాయికగా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడవి శేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా టీం అంతా నా ఫ్రెండ్సే. టీజర్‌, ట్రైలర్‌లో ‘ఇదం జగత్’ అనే టైటిల్‌ వచ్చినప్పుడు ఒకే రకమైన సంగీతం వస్తుంది. ఆ బ్రాండింగ్‌, కనెక్షన్ రెండింటికీ ఇవ్వడం శ్రీచరణ్‌లో నాకు నచ్చింది. ట్రైలర్ చాలా బాగుం‍ది అలాగే సినిమా కూడా అందరికీ కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను' అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన పద్మావతి మాట్లాడుతూ ‘సుమంత్‌ గారు ఇలాంటి స్టోరీ యాక్సప్ట్ చేస్తారా అనుకున్నాం. కానీ ఆయన ఓకే చెప్పడమే సర్ప్రైజ్ అనిపించింది. సుమంత్‌ గారి కెరీర్‌లో ఇది డిఫరెంట్‌ మూవీ. ఈ సినిమాకు పైకి కనిపించే హీరో సుమంత్‌ గారైతే తెరవెనుక హీరో దర్శకుడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకు హార్ట్. థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఆ సంగీతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆయనకు థ్యాంక్స్‌. కెమెరా వర్క్‌ బాగుంది. ప్రతీ ఒక్కరి కృషి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది’ అన్నారు. దర్శకుడు అనిల్‌ మాట్లాడుతూ ‘అవకాశం ఇచ్చిన నిర్మాతలు పద్మావతి, శ్రీధర్ గార్లకు  థ్యాంక్స్. ఇది టెక్నీషియన్స్ మూవీ. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ లాంటి అన్ని శాఖలు కలిస్తేనే ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ థ్యాంక్స్’ అన్నారు.

హీరో సుమంత్‌ మాట్లాడుతూ ‘మనిషిలో మంచి, చెడుతో పాటు అన్ని కోణాలు ఉంటాయి. ఇలాంటి పాత్ర కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. అందుకే ఈ క్యారెక్టర్‌ కోసం పెద్దగా కష్టపడలేదు. నన్ను అంతా ‘గోదావరి’ చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్‌లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్స్ పట్ల నాకు మొదట ఆసక్తి ఉండేది కాదు. రెండేళ్ల క్రితం నా మిత్రుడు అడవి శేష్‌ వల్ల ఆ ఆసక్తి పుట్టింది. అతను నటించిన క్షణం, గూఢచారి చిత్రాలు నాలో మార్పు తెచ్చాయి.

నాకిప్పుడు థ్రిల్లర్‌ జానర్‌ అంటే పిచ్చి. అందుకే ఈ జానర్‌లో సినిమా చేశాను. థ్యాంక్స్ శేష్‌. ఈసినిమా కోసం నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. ‘మళ్లీరావా’ రిలీజ్‌కు ముందు నవంబర్‌లో ఈ సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమాలో చాలా కొత్తగా ప్రయత్నించాం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగా కుదిరాయి. హార్ట్ ఆఫ్‌ ది ఫిల్మ్ శ్రీచరణ్‌ పాకాల అందించిన సంగీతం. విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement