
సుమంత్
జ్ఞాపకం, ప్రేమ, చావు, స్నేహం ఇలా సమాజంలో ఇప్పుడు ప్రతిదీ న్యూసే. కానీ లేని న్యూస్‌ను సృష్టిస్తే? అది కూడా డబ్బు కోసం. అలా ఎవరు చేశారు? అలా తప్పు చేసిన వారు చట్టానికి ఎలా పట్టుబడ్డారు? అనే అంశాల ఆధారంగా రూపొందిన సినిమా ‘ఇదం జగత్’. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్, అంజు కురియన్ జంటగా నటించారు. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించారు. నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను డిసెంబర్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. కెరీర్‌లో తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు సుమంత్. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కించాడు అనీల్. కథకు తగ్గ టైటిల్ కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీచరణ్ పాకాల స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment