మళ్ళీ రావా!
సుమంత్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మళ్ళీ రావా’. హిందీ హిట్ ‘బద్రినాద్‌కి దుల్హనియా’ ఫేమ్ ఆకాంక్షా సింగ్ కథానాయిక. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. గౌతమ్ మాట్లాడుతూ– ‘‘ఇది పక్కా కమర్షియల్ రొమాంటిక్ డ్రామా. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది.
మూవీ అవుట్‌పుట్ బాగా వచ్చింది. సుమంత్‌గారి కెరీర్‌లో బిగ్ హిట్ అవుతుంది. అవకాశం ఇచ్చిన హీరో సుమంత్, నిర్మాత రాహుల్‌కి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘30 రోజుల్లో ఒకే షెడ్యూల్‌లో సినిమాను కంప్లీట్ చేశాం. పది నెలల పాటు ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఆగస్ట్ 3న ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని రాహుల్ యాదవ్ అన్నారు. కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, ఎ. కార్తీక్, సాత్విక్, ప్రీతి తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.