సుమంత్
సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్. ప్రస్తుతం అనిల్ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సుమంత్ ఫొటో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప‍్రచారం జరుగుతోంది. సుమంత్ కొత్త స్టైల్‌లో కనిపించనున్న ఈసినిమాకు ‘ఇదం జగత్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment