journalist Role
-
TS Election 2023: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు.. 13 శాఖలను గుర్తించిన ఈసీ..
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్ట్‌లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. అయితే ఆరోజు జర్నలిస్ట్‌లు ఎన్నికల వార్తల సేకరణ విధుల్లో ఉండాలి. అంతే కాకుండా ఎన్నికల కమిషన్ నుంచి పాసులు పొందాలి. జర్నలిస్ట్‌లతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12అత్యవసర సేవల రంగానికి చెందిన ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. గెజిట్ జారీ.. చాలా మంది అత్యవసర సేవల రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్వభావం రీత్యా ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరికి సైతం ఓటు హక్కు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 60(సీ) కింద ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం.. ఇప్పటి వరకు కొంత మందికి మాత్రమే బ్యాలెట్ ఓటు వేసే అవకాశం ఉండేది. వారిలో ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్వీసు ఓటర్లు (సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేవారు. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనుంది. అలాగే జర్నలిస్టులు, ఎన్నికల విధులతో సంబంధం లేని అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు సైతం పోస్టల్ సదుపాయం కల్పిస్తోంది. ప్రత్యేక నోడల్ అధికారి.. జర్నలిస్టులు, అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. బ్యాలెట్ ఓటు వేయదలిచిన వారు దానిని నింపి స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించాలి. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అప్పటి నుంచి 5 రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ‘ఫారం–12డీ’ దరఖాస్తులను స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నవంబర్ 7నాటికి దరఖాస్తులు రిటర్నింగ్ అధికారికి చేరితే వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఎవరెవరికి బ్యాలెట్ ఓటు వేసే అవకాశం.. కేంద్ర ఎన్నికల కమిషన్ పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది. ఎయిర్‌పోర్టు ఆథారిటి ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్‌శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ), పౌర సరఫరాల శాఖ, బీఎస్ఎన్ఎల్, పోలింగ్ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్ పొందిన జర్నలిస్ట్‌లు, అగ్నిమాపక శాఖ అధికారులు బ్యాలెట్ ఓటు వేయవచ్చు. -
ఓటీటీలోకి నాగ చైతన్య.. టైమ్ ట్రావెల్ కథలో జర్నలిస్ట్‌గా !
అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ గుడ్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో కింగ్ నాగార్జునతో కలిసి నటించి హిట్ కొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చైతూ. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగా చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా నాగ చైతన్య ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో చై జర్నలిస్ట్‌గా, నెగెటివ్ పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. అందులో చైతన్య మేకోవర్ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్. మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సీజన్లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. అలాగే ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఒకవేళ చైతూ టైమ్ ట్రావెల్ వంటి కాన్సెప్ట్ ఉన్న వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్‌గా నెగెటివ్ రోల్ చేస్తే మంచి ఛాలెంజింగ్ పాత్ర దొరికినట్లే. ఈ పాత్రలో చైతూ ఎలా అలరిస్తాడో వేచి చూడాలి. -
అతను ఐఏఎస్.. ఆమె జర్నలిస్ట్!
ఐఏఎస్ ఆఫీసర్ల విధివిధానాలు, బాధ్యతలు వంటి అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారట హీరో రామ్‌చరణ్. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమా కోసమే ఈ ఫోకస్. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో ప్రారంభం అవుతుందని ఇటీవల ఓ సందర్భంలో చిత్రనిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. ఇందులో రామ్‌చరణ్ ఏ పాత్ర చేయనున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ముందు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చరణ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నాను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఆమెది జర్నలిస్టు పాత్ర అని సమాచారం. ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటించనున్నారట. చదవండి: ఐపీఎల్ సీజన్. ఓ అమ్మాయి కామెంటరీ ఇస్తోంది. -
ఢిల్లీలో తెలుగు జర్నలిస్ట్‌కు కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు మీడియా ప్రతినిధి ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడి అపోలో ఆస్పత్రిలో శుక్రవారం పరీక్ష జరపగా.. శనివారం ఉదయానికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సహచర తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ప్రతినిధులు తోడుగా వెళ్లి ఆస్పత్రిలో చేర్చగా.. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ ఢిల్లీ టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్‌తో మాట్లాడి పలు సూచనలు చేశారు. (53 మంది జర్నలిస్టులకు కరోనా) మీడియా అకాడమీ నుంచి బాధితుడి చికిత్సకు, కుటుంబ అవసరాల నిమిత్తం రూ.20 వేలు డిపాజిట్ చేయనున్నట్టు తెలిపారు. తోటి జర్నలిస్టులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే రూ.10 వేలు డిపాజిట్ చేస్తామని భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే ప్రతినిధుల అభ్యర్థన మేరకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా అపోలో ఆసుపత్రి వర్గాలతో మాట్లాడారు. జర్నలిస్టు పనిచేస్తున్న టీవీ చానల్ యాజమాన్యం తక్షణ సాయంగా రూ.లక్ష ఆస్పత్రిలో జమ చేసింది. టీయూడబ్ల్యూజే సభ్యులు, ఢిల్లీ ఆంధ్రా జర్నలిస్ట్ అసోసియేషన్ (ఆజాద్) సభ్యులు తక్షణ చర్యలపై, జర్నలిస్టుల సంక్షేమంపై శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై చర్చించారు. (మీడియా మిత్రులకు కేజ్రీవాల్ ‘గుడ్‌న్యూస్’) ఉప రాష్ట్రపతి ఆరా అపోలో ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లతో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడి మీడియా ప్రతినిధి క్షేమంపై ఆరా తీశారు. ఉప రాష్ట్రపతి జర్నలిస్టు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి భరోసా ఇచ్చారు. కాగా జర్నలిస్టుల అభ్యర్థన మేరకు ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులందరికీ కోవిడ్ టెస్ట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. -
జర్నలిస్టులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్) : జర్నలిస్టులు నిష్పాక్షికత, సత్యసంధత, నైతికత అనే మూడు విలువలు పాటించాలని, యధార్థంగా సమాజంలోని మంచి చెడులపై వార్తలు రాయాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణ అధ్యక్షతన ‘జర్నలిజం–సామాజిక బాధ్యత’ అనే అంశంపై శుక్రవారం ఒకరోజు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్లం నారాయణ హాజరై మాట్లాడారు. మీడియా రంగంలో రోజురోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటిని అనుగుణంగా జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులు అనుసరించాలన్నారు. సమాజంలో ఉన్న మంచి, చెడులపై జాగ్రత్తగా వ్యవహరిస్తూ వార్తలు రాయాలన్నారు. డిజిటల్ మీడియా ద్వారా అనర్థాలు పెరిగిపోతున్నాయని, జర్నలిజం అనేది కత్తిమీద సాములాంటిదన్నారు. ఉత్తమ జర్నలిస్టులుగా ఎదగాలంటే సత్యసంధత, నిష్పాక్షికత, నైతికత ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వార్తలు రాయాలని, రాసిన వార్తలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తు చేశారు. జర్నలిజం విద్యార్థులు ముందుగా భాష, పదజాలంపై పట్టుండాలని, దీని కోసం పత్రికలు, పుస్తకాలు చదివి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. మరో అతిథి, ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం వార్తపత్రికలతో పాటు ఫేస్బుక్, వాట్సాఫ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు సమాచారం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, కానీ సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలన్నీ సత్యాలు కావని గుర్తించాలని వాటిని నిర్ధారణ చేసుకోవాలన్నారు. మనకు వచ్చిన సమాచారం సహాయంతో జరిగిన సంఘటనతోపాటు జరగబోయే అంశాలపై విశ్లేషణ చేసి వార్తలు రాయాలన్నారు. సమాజంలోని ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే శక్తి పత్రికలకు, మీడియాకు ఉంటుందని, రాజకీయ, సామాజిక ఏ పత్రిక ఎంతబలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ పత్రికలను పాఠకులను ఆకర్షిస్తాయన్నారు. టెలివిజన్, సోషల్‌మీడియా జర్నలిజంలో నూతన మార్పులు వచ్చాయన్నారు. ఉన్నది ఉన్నట్లు రాయడం కాకుండా విశ్లేషించి వార్తలు రాయాలని, ఆలోచన శక్తిని పదునుపెడితే జర్నలిజం వృత్తిలో రాణిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం కరీంగనర్ జేసీ శ్యాంప్రసాద్‌లాల్, టీయూడబ్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, జర్నలిస్టులు ప్రకాశ్‌రావు, పీఎస్.రవీంద్ర, కవి అన్నవరం దేవేందర్ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. జర్నలిజం కోర్సు కోఆర్డినేటర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, ఎన్సీసీ అధికారి పర్లపల్లి రాజు, ఎన్ఎస్ఎస్ అధికారి బి.సురేష్‌కుమార్, అద్యాపకులు, విద్యార్థులు, వివిధ ప్రాంతాలకు చెందిన పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ ఆ చాన్స్ రాదు
కేవలం వెండితెరపై మాత్రమే కాదు డిజిటల్ సెక్టార్‌లోనూ ఆఫర్లను కొల్లగొడుతూ కెరీర్లో మంచి హైప్లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ‘లస్ట్‌స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్, ఘోల్’ వంటి వెబ్ బేస్డ్ మరియు టీవీ షోస్‌లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారామె. ఈ అనుభవం ఎలా ఉంది? అన్న ప్రశ్నను రాధిక ముందుంచితే...‘‘డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో నేనింకా సంతృప్తిగా లేను. ఎందుకంటే ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్‌లో ఒక పార్ట్‌లో మాత్రమే ఉన్నాను. ఇక ‘సాక్రెడ్ గేమ్స్’లో చిన్న పాత్ర చేశా. ‘ఘోల్’లో మాత్రమే మెయిన్ లీడ్‌గా చేశాను. కానీ వీటన్నింటిలో నటించడం కొత్త అనుభూతిని ఇస్తోంది. ముందు ముందు ఇంకా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను అన్నారు’’. ఈ భామ హాలీవుడ్లో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో మైఖేల్ వింటర్ బోటమ్ దర్శకత్వంలో ఓ సినిమా (‘ది వెడ్డింగ్ గెస్ట్’ పరిశీలనలో ఉన్న టైటిల్) చేస్తోన్న సంగతి తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ– ‘‘ఆసియాలోని కొందరి హీరోయిన్స్‌కు మాత్రమే నాన్–ఇండియన్ సినిమాల్లో నటించే చాన్స్ వస్తుంది. ఆ చాన్స్ నాకొచ్చినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు రాధికా ఆప్టే. ‘రక్తచరిత్ర, లెజెండ్, లయన్’ వంటి తెలుగు సినిమాల్లో రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘అంథా ధూన్, బజార్’ ఈనెల 5, 26 తేదీల్లో విడుదల కానున్నాయి. -
‘యూ టర్న్’ లో జర్నలిస్ట్‌గా సామ్
రంగస్థలం, మహానటి సినిమాలతో ఈ వేసవిలో అభిమానులకు సమంత కనులవిందు చేశారు. ప్రస్తుతం ఆమె... విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే తమిళ్లో విడుదలై సంచనాలు సృష్టిస్తోంది ఈ సినిమా. ప్రస్తుతం సమంత ఓ కన్నడ రీమేక్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ మూవీ ‘యూ టర్న్’ ను అదే పేరుతో తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో సమంత జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో ఓ కీలకపాత్రకు భూమికను తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. -
థ్రిల్లర్ జానర్లో ‘ఇదం జగత్’!
సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసిన అక్కినేని వారసుడు సుమంత్ ఇటీవల మళ్ళీరావా సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సుమంత్‌ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. మళ్ళీరావా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలకు ఓకె చెప్పాడు సుమంత్. ప్రస్తుతం అనిల్ శ్రీకంఠంని దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు సుమంత్. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అంజు కురియెన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో సుమంత్ ఫొటో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా సుమంత్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సుమంత్ కొత్త స్టైల్లో కనిపించనున్న ఈసినిమాకు ‘ఇదం జగత్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
సల్మాన్‌ను ఆ ప్రశ్న అడుగుతా!
సల్మాన్ ఖాన్ని సోనాక్షి సిన్హా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఆ ప్రశ్న ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడుగుతారట. అసలు సల్మాన్‌ని సోనాక్షి ఈ ప్రశ్న ఎందుకు అడగాలనుకున్నారనే విషయానికొస్తే.. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘నూర్’. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ రోల్లో యాక్ట్ చేశారు. పాకిస్తాన్ రైటర్ సబా ఇంతియాజ్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న సోనాక్షీని.. ‘మీరే కనుక రియల్‌గా జర్నలిస్ట్ అయితే మీ నాన్నగారు శతృఘ్న సిన్హాను ఏం ప్రశ్న అడుగుతారు’ అని కొందరు జర్నలిస్టులు అడగ్గా... ‘ఖామోష్ అని మా నాన్న తిరిగి బదులు చెప్పని ప్రశ్న అడుగుతా’ అన్నారు. మరి, సల్మాన్ ఖాన్‌ను ఏ ప్రశ్న అడుగుతారని అడగ్గా.. ‘వేరే ఏం ఉంది. అందరూ అడిగేదే. మీకు తెలిసిందే. అదేనండి. సల్మాన్‌ని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుం టారు? అని అడుగుతా’ అని సోనాక్షి సమాధానం ఇచ్చారు. మరి.. సల్మాన్‌ని సోనాక్షీ డైరెక్ట్‌గా ఈ ప్రశ్న అడిగితే ఆయన్నుంచి ఏం సమాధానం వస్తుందో?