‘యూ టర్న్‌’ లో జర్నలిస్ట్‌గా సామ్‌ | Samantha Playing Journalist Role In U Turn Movie | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 4:01 PM | Last Updated on Mon, May 28 2018 4:21 PM

Samantha Playing Journalist Role In U Turn Movie - Sakshi

రంగస్థలం, మహానటి సినిమాలతో ఈ వేసవిలో అభిమానులకు సమంత కనులవిందు చేశారు. ప్రస్తుతం ఆమె... విశాల్‌ ‘అభిమన్యుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే తమిళ్‌లో విడుదలై సంచనాలు సృష్టిస్తోంది ఈ సినిమా. ప్రస్తుతం సమంత ఓ కన్నడ రీమేక్‌ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కన్నడ మూవీ ‘యూ టర్న్‌’ ను అదే పేరుతో తమిళ, తెలుగు భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో సమంత జర్నలిస్ట్‌ పాత్రను పోషిస్తున్నారు. అలాగే క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో ఓ కీలకపాత్రకు భూమికను తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. కాగా ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. కన్నడలో తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement