‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’కు యు/ఏ | Agent Sai Srinivasa Athreya Censor Completed | Sakshi
Sakshi News home page

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’కు యు/ఏ

Published Sun, Jun 2 2019 12:50 PM | Last Updated on Sun, Jun 2 2019 2:57 PM

Agent Sai Srinivasa Athreya Censor Completed - Sakshi

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని యు/ఏ స‌ర్టిఫికేట్‌ను తెచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు. స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వచ్చింది.

న‌వీన్ డిటెక్టివ్ పాత్రలో న‌టించిన ఈ సినిమా ఆసాంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగతుందని తెలుస్తోంది.మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్రఫీ అందించారు. డిఫ‌రెంట్ టేకింగ్‌, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. మ‌ళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement