నిధి కోసం వేట | Director Swaroop RSJ Released First Look Of His Second Movie | Sakshi
Sakshi News home page

నిధి కోసం వేట

Published Wed, Sep 9 2020 2:59 AM | Last Updated on Wed, Sep 9 2020 2:59 AM

Director Swaroop RSJ Released First Look Of His Second Movie - Sakshi

‘ఏజంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అంటూ చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించిన దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె. మంగళవారం తన రెండో సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘క్షణం’, ‘ఘాజీ’, ‘గగనం’ చిత్రాలను అందించిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించనున్నారు. తిరుపతికి సమీపంలోని ఓ గ్రామంలో నిధి గురించి జరిగే కథే ఈ సినిమా అంటున్నారు స్వరూప్‌. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ముఖం సరిగా కనిపించకుండా ఉన్న వ్యక్తి ఫోటో కింద ‘వాంటెడ్‌ డెడ్‌ ఆర్‌ ఎలైవ్‌’ అని ఉంది. ‘‘ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించుకుంటుంది’’ అన్నారు నిర్మాతలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement