
నేచురల్ స్టార్ నాని హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. రిలీజ్‌కు ఇంకా 20 రోజులు మాత్రమే సమయం ఉన్నా చిత్రయూనిట్ ప్రమోషన్ విషయంలో ఇంకా స్పీడు పెంచలేదు.
దీంతో సినిమా మరోసారి వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అదే రోజు సాహో రిలీజ్ అనే ప్రకటన రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల సందడి కనిపించకపొవటంతో సినిమా మరోసారి వాయిదా పడనుందన్న ప్రచారం జరుగుతోంది.
నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఈ బ్యానర్‌లో ఒక్క హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం నాని కూడా ఓ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న గ్యాంగ్ లీడర్ సినిమాకు కావాల్సిన బజ్ మాత్రం కనిపించటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment