
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. మాంగటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించి ఎన్నో రికార్డ్‌లను సొంతం చేసుకుంది. అయితే మెగా వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గ్యాంగ్ లీడర్ రీమేక్‌కు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ అద్భుతమైన టైమింగ్‌తో అలరించిన రాజారామ్ పాత్రలో రామ్ చరణ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల కల నేరవేరబోతోందన్న టాక్ వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన తేజ్ ఐ లవ్ యు ఆడియో రిలీజ్ వేడుకలో మాట్లాడిన చిరు, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందన్న హింట్ ఇచ్చారు. అయితే అది గ్యాంగ్ లీడర్ రీమేకే అన్న ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ కథను ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా మార్పులు చేసిన తెరకెక్కించేందుకు కేయస్ రామారావు ప్రయత్నిస్తున్నారట. రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ తరువాత చరణ్ చేయబోయే సినిమా ఇదే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై మెగా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment