
లోక్‌సభ ఎన్నికల సమయంలో రేసుగుర్రం విలన్ రవి కిషన్ శుక్లాకు పెద్ద చిక్కే వచ్చిపడింది.

ఆయన నా కుమార్తెకు తండ్రి అంటూ అపర్ణ అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది.

1996లో రవికిషన్‌తో తన పెళ్లి జరిగిందని, మా ప్రేమకు గుర్తుగా పాప కూడా పుట్టిందని చెప్పుకొచ్చింది.

ఆ పాపకు ఇప్పుడు పాతికేళ్లు. తన పేరు షిన్నోవా.. బాలీవుడ్‌లో నటిగా రాణిస్తోంది.

రవి కిషన్ తన కన్నతండ్రి అంటూ ఇటీవలే ఓ వీడియో షేర్ చేసింది.

అందులో రవికిషన్ ఆమెను ఎత్తుకుని ముద్దాడినట్లుగా ఉంది.

ఆయన తన తండ్రి అని ఒప్పుకునేవరకు పోరాటం చేస్తానంటోందీ బ్యూటీ.

ఈ మేరకు ముంబై కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేసింది. తనకు, నటుడికి డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

కాగా రవికిషన్.. ప్రీతి శుక్లా అనే మహిళను పెళ్లి చేసుకోగా వీరికి రివా అనే కూతురు ఉంది.

ఇప్పుడు సడన్‌గా తాను కూడా రవి భార్యనే అంటూ అపర్ణ అనే మహిళ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

దీంతో నటుడి భార్య ప్రీతి.. తప్పుడు ఆరోపణలు చేస్తూ కావాలని ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అపర్ణ సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది.