లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందే నటుడు, బీజేపీ గోరఖ్‌పూర్ ఎంపీ 'రవి కిషన్ శుక్లా' తన కుమార్తెకు తండ్రి ఓ మహిళా మీడియా ముందుకొచ్చి చెప్పింది. తన కుమార్తెను ఆయన స్వీకరించాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు చేసిన మహిళతో పాటు మరో ఆరుగురిపైన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
రవికిషన్ భార్య ప్రీతి శుక్లా ఫిర్యాదు మేరకు హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం అర్థరాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మహిళతో పాటు అపర్ణా ఠాకూర్, ఆమె భర్త రాజేష్ సోనీ, కూతురు షెనోవా సోనీ, కొడుకు సోనాక్ సోనీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు వివేక్ కుమార్ పాండే, జర్నలిస్టు ఖుర్షీద్ ఖాన్ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
అపర్ణ సోనీ అలియాస్ అపర్ణా ఠాకూర్ తనకు అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని బెదిరించినట్లు కూడా బీజేపీ ఎంపీ భార్య ఆరోపించింది. ఆమె రూ. 20 కోట్ల డబ్బు ఇవ్వాలని రవి కిషన్ భార్య ప్రీతి శుక్లా పేర్కొంది. ఆమె అడిగిన డబ్బు తనకు ఇవ్వకపోతే.. రవి కిషన్‌ను అత్యాచారం కేసులో ఇరికించి అతని ప్రతిష్టను దిగజార్చేస్తానని బెదిరించినట్లు పోలీసులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment